రామ్‌చరణ్‌ అత్తగారి ఊరిలో ప్రియాంక చోప్రా.. ఇంతకీ ఎందుకు వెళ్లిందో తెలుసా.?

Published : Jan 24, 2025, 04:39 PM ISTUpdated : Jan 24, 2025, 04:43 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన ఈ బ్యూటీ. ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తోంది. మొన్నటికిమొన్న చిలుకురు బాలాజీ టెంపుల్‌ను సందర్శించిన ప్రియాంకా.. తాజాగా మరో పురాతన ఆలయాన్ని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది..   

PREV
14
రామ్‌చరణ్‌ అత్తగారి ఊరిలో ప్రియాంక చోప్రా.. ఇంతకీ ఎందుకు వెళ్లిందో తెలుసా.?

వారం రోజుల క్రితం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. అసలు ప్రియాంక హైదరాబాద్‌కు ఎందుకు వచ్చిందన్న ఆసక్తి అందరిలో పెరిగింది. అయితే మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకే ప్రియాంక ఇండియాకు వచ్చిందని వార్తలు వచ్చాయి. సినిమా కథ చర్చల్లో భాగంగానే ప్రియాంక గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. 
 

24

అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు ప్రియాంక కానీ, ఇటు రాజమౌళి కానీ ఈ విషయం గురించి ఏం స్పందించలేదు. అయితే ప్రియాంక చోప్రా మాత్రం తెలంగాణలో ఉన్న ప్రముఖ ఆలయాలను చుట్టేస్తోంది. మొన్న చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించిన ప్రియాంక అందుకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియా వేదిగా పంచుకుంది. ఈ సమయంలోనే ప్రియాంక చోప్రా ఉపాసనకు కృతజ్ఞతలు చెబతూ పోస్ట్ చేసింది. 
 

34

కాగా తాజాగా మరో పురాతన ఆలయాన్ని దర్శించుకుంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన దోమకొండ కోటలోని మహాదేవుని ఆలయంలో ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న సోమసూత్ర శివలింగానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించిన ప్రియాంక.. తర్వాత అక్కడున్న అద్దాల మేడను, రాణీమహల్ను సందర్శించారు.

అక్కడున్నఇతర కట్టడాలను సైతం పరిశీలించింది. దోమకొండ లాంటి చిన్న ఊరుకు ప్రియాంక చోప్రా రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఆలయానికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కోట కామినేని వంశీయులకు చెందింది. నిజాం నవాబులకు, అంతకు ముందు కాకతీయ రాజులకు సామంతులుగా ఉంటూ కామినేని కుటుంబం దోమకొండ సంస్థానాన్ని పాలించే వారు. కోట చుట్టూ సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో రాతి కట్టడంతో కూడిన ప్రహరీగోడను నిర్మించారు. ఈ కోటకు రామ్‌ చరణ్‌కు సంబంధం ఉందని మీకు తెలుసా.? 
 

44

ఉపాసన పూర్వీకులు..

ఒక రకంగా చెప్పాలంటే దోమకొండ గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అత్తగారి ఊరు అని చెప్పాలి. ఒకప్పుడు ఈ కోటను పాలించిన కామినేని కుటుంబానికి చెందిన ఉమాపతి రావు మనవరాలు, కామినేని అనిల్ కూతురే ఉపాసన కామినేని. ఉపాసన రామ్‌ చరణ్‌ సతీమణి అని తెలిసిందే. గతంలో పలుసార్లు రామ్‌ చరణ్‌ సైతం ఈ కోటను సందర్శించిన విషయం తెలిసిందే. శివరాత్రి సమయంలో ఉపాసన, రామ్‌ చరణ్‌లు ఈ కోటలో ఉన్న శివలింగానికి పూజలు చేశారు. ఇదండీ రామ్‌ చరణ్‌కు ఈ కోటకు ఉన్న సంబంధం. 

Read more Photos on
click me!

Recommended Stories