`హత్య` మూవీ రివ్యూ.. వివేకానంద రెడ్డిని హత్య చేసింది సొంత కూతురా? జగనా?

Published : Jan 24, 2025, 04:10 PM IST

`హత్య` పేరుతో తాజాగా తెలుగులో సినిమా చేశారు. ఇది వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రధానంగా రూపొందిందని తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
`హత్య` మూవీ రివ్యూ.. వివేకానంద రెడ్డిని హత్య చేసింది సొంత కూతురా? జగనా?

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు మిస్టరీ ఇంకా వీడలేదు. కొందరిని బలపశువులను చేసే ప్రయత్నాలు జరిగాయి. కొందరిపై ఆరోపణలు వచ్చాయి. అందులో మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డితోపాటు, అవినాష్‌ రెడ్డి పేర్లు వినిపించాయి. కానీ వాల్లే కారకులు అని తేలలేదు. ఈ క్రమంలో రకరకాలు ఆరోపణల వచ్చాయి.

ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అయినా తేలలేదు. ఈ క్రమంలో దీనిపై తాజాగా సినిమా తీశారు. `హత్య` పేరుతో రూపొందిన ఈ మూవీ సేమ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుని తలపించేలా ఉంది. కాకపోతే ఇదంతా కల్పితం అని టీమ్‌ ముందే డిస్‌క్లైమర్‌లో వెల్లడించడం విశేషం.

ఇందులో ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్‌, భరత్‌ రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ విద్య బసవ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 24)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

26

కథః 
ధర్మేంద్రరెడ్డి(రవి వర్మ) ఇంట్లో హత్యకు గురై బాత్‌రూమ్‌లో పడి ఉండటం నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ధర్మేంద్ర రెడ్డి హత్యకు గురయ్యాడనే విషయం అంతా పాకుతుంది. గుండెపోటు అని, బాత్‌రూమ్‌లో పడిపోయి చనిపోయాడని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుని విచారించే బాధ్యతని ఐపీఎస్‌ అధికారి సుధాకి అప్పగిస్తాడు సీఎం కిరణ్‌(భరత్‌ రెడ్డి). దీంతో తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారించడం స్టార్ట్ అవుతుంది.

ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. ధర్మేంద్ర ఇంట్లో సీసీ టీవీ పెట్టించలేదని, ఆయన ముస్లీ అమ్మాయి సలీమా(పూజా రామచంద్రన్‌)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మరోవైపు రాజకీయ కుట్రలో భాగంగా ఆయన్ని అనుచరులే చంపేశారని? ఇంకోవైపు ఫ్యామిలీ పాత్ర ఉందని, అధికారం కోసం చేశారనే ఆరోపణల మధ్య ఈ కేసు విచారణ జరుగుతుంది. ఒక్కో విషయం బయటకు వస్తుంటుంది.

ధర్మేంద్ర రెడ్డి ఎందుకు అప్పులు చేశారు? ఎవరికోసం చేశారు? ఆయన హత్యకు ఆయన రెండో భార్య సలీమా పాత్ర ఉందా? తన కూతురు ఈ కేసు విషయంలో ఎందుకు ఇన్‌ వాల్వ్ అవుతుంది? ఇందులో కిరణ్‌ రెడ్డి ప్రమేయం ఏంటి? అదే సమయంలో చిన్నా రెడ్డి పాత్ర ఏంటి? ఆయన ఎవరు? ధర్మేంద్ర తెరవెనుక జీవితం ఏంటి? అనే సస్పెన్స్‌ అంశాలకు సమాధానమే ఈ మూవీ. 
 

36

విశ్లేషణః
`హత్య` టీజర్‌, ట్రైలర్‌ లు చూస్తేనే ఇది వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తీసిన మూవీ అని అర్థమవుతుంది. కాకపోతే ఇది కల్పితమని చెప్పి రాజకీయంగా, లీగల్‌గా సేఫ్‌గా ఉండే ప్రయత్నం టీమ్‌ చేసిందని చెప్పొచ్చు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అయిన వారికి ఈ సినిమా క్లారిటీగా అర్థమవుతుంది.

ఇది ఆయన మర్డర్‌ కేసు మీద తీసిన మూవీనే అని.  పొలిటికల్‌ ప్రధానంగా సాగే స్టోరీ కావడంతో ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందరికి తెలిసిన కథలను చెప్పడమనేది కత్తి మీద సాములాంటిది. ఏ వైపు చూపించినా విమర్శలు వస్తాయి? ప్రొపగండా మూవీ అయిపోతుంది. ఈ సినిమా విషయంలో దర్శకురాలు ఒక సైడ్‌ తీసుకున్నారా? నిజం చెప్పారా? అనేది సస్పెన్స్.

అయితే జగన్‌(వైసీపీ) వైపు తీసుకుని సొంత కూతురే దీనికి కారణం అనే చెప్పే ప్రయత్నం జరిగిందనిపిస్తుంది. వివేకా నంద రెడ్డి, జగన్‌ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని? చిన్నాన్న విషయంలో జగన్‌ ఎంతో కేరింగ్‌గా ఉన్నారని ఈ మూవీని బట్టి అవుతుంది. 
 

46

ఆ విషయాలు పక్కన పెట్టి సినిమాగా చూసినప్పుడు ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ తిరిగే కథ. ధర్మేంద్ర రెడ్డిని ఎవరు హత్య చేశారనేదాన్ని ఆద్యంతం క్యూరియాసిటీ క్రియేట్‌ చేసేలా రూపొందించారు. మనం రెగ్యూలర్‌గా చూసే మర్డర్‌ మిస్టరీ మూవీనే తలపిస్తుంది. పొలిటికల్‌ టచ్‌ ఉండటంతో ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేసింది.

మొదటి భాగం మొత్తం విచారణ చుట్టూనే సాగుతుంది. అనుమానితులను ముందు నుంచే రివీల్‌ చేస్తుంటారు. ఆయా సన్నివేశాలు బాగున్నాయి. కాకపోతే ఇన్వెస్టిగేషన్‌ చాలా లెంన్తీగా అనిపిస్తుంది. సాగదీస్తున్నట్టుగా ఉంది. ఎంత సేపు కథ ముందుకు సాగడం లేదనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. సెకండాఫ్‌లో మాత్రం పరుగులు పెడుతుంది. చిన్న చిన్న ట్విస్ట్ లు, ధర్మేంద్ర సలీమా లవ్‌ స్టోరీ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి.

సినిమా మొత్తంలో ఇదే హైలైట్‌ పాయింట్‌ కూడా. కమర్షియల్‌ ఎలిమెంట్ పరంగా ఇది బాగా న్యాయం చేస్తుంది. అదే సమయంలో కామన్‌ ఆడియెన్ ని కూడా అలరించేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు, కథనం తీసుకునే మలుపు, ట్విస్ట్ లు వాహ్‌ అనేలా ఉంటాయి. సిట్‌ అధికారి సుధా ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. యాక్షన్‌ సినిమాలను తలపించే ఎలిమెంట్లు ఆకట్టుకునే అంశాలు.

ఓవరాల్‌గా ఇదొక మంచి మర్డర్‌ మిస్టరీ మూవీ అవుతుందని చెప్పొచ్చు. సినిమా ఎవరిపై తీశారనేది తెలిసినప్పుడు సినిమాలో చూపించినట్టు ప్రత్యర్థులకు ఈ మూవీ నచ్చకపోవచ్చు. కామన్‌ ఆడియెన్స్ మాత్రం మంచి మూవీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 

56

నటీనటులుః 
ధర్మేంద్ర రెడ్డి పాత్రలో రవి వర్మ జీవించాడు. చాలా చోట్ల వివేకా నంద రెడ్డిని తలపించారు. పాత్రని అంత రక్తికట్టించారు. సెటిల్డ్ నటన ఈ మూవీకి హైలైట్‌ పాయింట్‌. విచారణ అధికారి సుధాగా ధన్య బాలకృష్ణ బలమైన పాత్రలో మెరిసింది. ఆమె విచారణనే సినిమాలో ఎక్కువగా ఉంటుంది. చాలా మెచ్యూర్‌గా చేసింది ధన్య. ఆమె కెరీర్‌లో మంచి రోల్‌ అవుతుంది. కిరణ్‌ రెడ్డి పాత్రలో భరత్‌ రెడ్డి కనిపించారు. కనిపించేది కాసేపే అయినా బాగా చేసింది.

కవితమ్మ పాత్రలో హిమ బిందు కూడా బాగా చేసింది. చిన్నా రెడ్డి పాత్రలో ఉప్పెన రమణకూడా ఆకట్టుకున్నారు. సలీమ పాత్రలో పూజా రామచంద్రన్‌ మరో హైలైట్‌గా నిలిచే రోల్‌. ఆమె అంతే సహజంగా చేసి మెప్పించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. నటీనటులు చాలా వరకు పాత్రల్లో జీవించారు. 
 

66

టెక్నీకల్‌గాః 

సినిమా టెక్నీకల్‌గా చాలా క్వాలిటీగా ఉంది. మ్యూజిక్‌ పరంగా గానీ, కెమెరా వర్క్ గానీ అద్భుతంగా ఉంది. పెద్ద రేంజ్‌ సినిమాలను తలపించాయి. మర్డర్‌ సీన్లలో ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. సహజమైన ఫీలింగ్‌గ్‌ ని తెప్పించింది. కెమెరా పనితనం బాగుంది. ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉంది. దర్శకులు శ్రీ విద్య బసవ టేకింగ్‌ బాగుంది. సహజంగా చేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. మంచి పొలిటికల్‌ మర్డర్‌ మిస్టరీ చిత్రాన్ని అందించారు. అయితే కొంత స్పీన్‌ స్క్రీన్‌ప్లేతో చేస్తే మరంత బాగుండేది. ఈ సినిమాని క్వాలిటీగా నిర్మించిన నిర్మాతలను కూడా అభినందించాలి. 

ఫైనల్‌గాః వైఎస్‌ జగన్‌ అభిమానులకు నచ్చే మూవీ, అపోజిట్‌ వాళ్లకి నచ్చడం కష్టం. 

రేటింగ్‌ః 2.75
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories