నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే 100 శాతం హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే అఖండ 2 కూడా మొదలైంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.