అదరగొట్టిన రెండు జడల పాప.. శారీ లుక్ లో ప్రియమణి స్టన్నింగ్ ఫోజులు

pratap reddy   | Asianet News
Published : Nov 03, 2021, 12:14 PM IST

గ్లామర్ బ్యూటీ ప్రియమణి గురించి పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. 

PREV
18
అదరగొట్టిన రెండు జడల పాప.. శారీ లుక్ లో ప్రియమణి స్టన్నింగ్ ఫోజులు

గ్లామర్ బ్యూటీ ప్రియమణి గురించి పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియన్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. ఇక తన కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి పక్కా ప్లానింగ్ తో వ్యవహరించింది. 

 

28

చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.  

 

38

Priyamani  ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి Dhee Jodi షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి. 

48

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. 

58

ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. 

 

68

ప్రియమణికి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ వస్తున్నాయి. Family man 2లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్యగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన Narappa చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ప్రియమణి పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది. 

78

ప్రస్తుతం ప్రియమణి విరాట పర్వం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. గ్లామర్ విషయంలో ప్రియమణి కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. 37 ఏళ్ల వయసులో కూడా ప్రియమణి ట్రెండీ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తోంది. 

88

తాజాగా ప్రియమణి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో నెటిజన్లని అలరిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లూ సరీలో ప్రియమణి గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. పైగా ఆమె వేసుకున్న రెండు జడలు తెగ ఆకర్షిస్తున్నాయి. అల్లరి పిల్ల తరహాలో ప్రియమణి ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి. 

click me!

Recommended Stories