చీరకట్టిన ‘బ్రో’ బ్యూటీ.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో ప్రియా వారియర్ మెరుపులు..

Published : Aug 06, 2023, 06:40 PM IST

‘బ్రో’ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చీరకట్టిన మలయాళీ ముద్దుగుమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ లుక్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.   

PREV
16
చీరకట్టిన ‘బ్రో’ బ్యూటీ.. ట్రాన్స్ ఫరెంట్ శారీలో ప్రియా వారియర్ మెరుపులు..

మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)    నటించిన  మలయాళ చిత్రం  తెలుగులో ‘లవర్స్’గా విడుదలైంది. ఈ చిత్రంలోనే కన్నుగీటే వీడియో  ఈ ముద్దుగుమ్మ సెన్సేషనల్ గా మారింది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. 
 

26

ఆ క్రేజ్ తోనే ప్రియా వారియర్ తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో మూడు చిత్రాలు చేసింది. ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’, ‘చెక్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అలరించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 
 

36

ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన Bro The Avatar మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి అటు బాక్సాఫీస్ నుంచి మంచి రిజల్ట్స్ ను అందుకుంది. 
 

46

అయితే, ఈ చిత్రంలో ప్రియా వారియర్ పాత్ర చిన్నగా ఉంటుంది. అయినా సినిమాలో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ‘బ్రో’తో కాస్తా కలిసి వచ్చిందనే చెప్పాలి. హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రియాకు ఈ సినిమా నుంచి ఉపశమనం కలిగిందని చెప్పాలి. 
 

56

ఇదిలా ఉంటే.. ప్రియా వారియర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తన న్యూ లుక్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా శారీ లుక్ లో కట్టిపడేసింది. చీరకట్టులో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 

66

ట్రాన్స్ ఫరెంట్ శారీలో గ్లామర్ మెరుపులు కూడా మెరిసింది.స్లీవ్  లెస్ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది. మత్తు ఫోజులతో మైమరిపించింది. వెలిగిపోతున్న అందంతో ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ప్రియా వారియర్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉణ్నాయి. తమిళం, మలయాళం, హిందీలో ఆయా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories