ట్రాన్స్ ఫరెంట్ శారీలో కవ్విస్తున్నబుట్టబొమ్మ ఫోజులు.. చీరకట్టులో ప్రణీతా సుభాష్ మెరుపులు.. బ్యూటీఫుల్ లుక్

First Published | Aug 6, 2023, 4:59 PM IST

బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా మెరుస్తోంది. 
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్, కన్నడ బ్యచూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో కొన్ని సినిమాలే చేసినా తన నటన, అందంతో గుర్తుండిపోయేలా చేసింది. 
 

‘బావ’ చిత్రంతో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ చిత్రం ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంది. ఏకంగా స్టార్స్ సరసన నటించే ఛాన్స్  దక్కించుకుంది.
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. తన నటనతో ‘బుట్టబొమ్మగా’నూ మారిపోయింది. అందం, అభినయంతో ఫిదా చేసింది. ఆ వెంటనే ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ మరింతగా ఆకట్టుకుంది. 
 

ఇక మొదటి లాక్ డౌన్ లోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి జరిగింది. గతేడాది పండంటి ఆడబిడ్డకు కూడా జన్మిచ్చింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ, కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీకి సిద్ధమైంది. ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ అక్కడ మొట్టమొదటి సినిమా చేస్తోంది. 
 

మలయాళ స్టార్ దిలీప్ కుమార్ 148వ సినిమాలో ప్రణీతా హీరోయిన్ గా ఎంపికైంది. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. బుట్టబొమ్మ మరిన్ని సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో ప్రణీతా ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి మరింత అందంగా మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరుపులు మెరిపించింది. కొంటె ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!