Priya Bhavani Shankar Marriage: తమిళ , తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి ప్రియా భవానీ శంకర్.. తన చిరకాల ప్రియుడు రాజవేల్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. చాలా కాలంగా ప్రేమిస్తున్న రాజవేల్‌తో పెళ్లి పీటలెక్కిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాకు పెళ్లయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఎర్రటి పట్టుచీర కట్టుకుని పెళ్లికూతురు గెటప్‌లో ఉండగా.. రాజవేల్ తెలుపు రంగు దుస్తుల్లో ఉన్నాడు. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటున్న, రాజవేల్ తాళి కడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
24
ముందే హింట్ ఇచ్చిన ఇన్‌స్టా పోస్టులు!
ఈ వీడియో బయటకు రాకముందే ప్రియా భవానీ శంకర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు అభిమానుల్లో కొన్ని అనుమానాలను రేకెత్తించాయి. రీసెంట్‌గా తన ఇన్‌స్టా స్టోరీలో రాజవేల్‌తో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. అందులో ఇద్దరూ మల్లెపూల దండలు వేసుకుని ఉన్నారు. మరో పోస్ట్‌లో చేతులకు మెహందీ పెట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది.
ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ పెళ్లి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా అని అడిగారు. కానీ పెళ్లి గురించి అప్పట్లో ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోతో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి.
34
అనిరుధ్ పెళ్లి వార్తల మధ్య ఊహించని సర్ప్రైజ్!
నేడు అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతుండగా.. ప్రియా భవానీ శంకర్ పెళ్లి వీడియో సర్ప్రైజ్‌గా బయటకు రావడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అనిరుధ్ తన పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్‌గా ఉంచాడని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్న వేళ.. ప్రియా పెళ్లి వీడియో బయటకు రావడం మరో ఆశ్చర్యకరమైన విషయం.
దీంతో సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి గురించి ముందుగా ప్రకటించకుండా, సడెన్‌గా పెళ్లి వీడియోను రిలీజ్ చేయడం అభిమానులకు స్వీట్ షాక్‌లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
బుల్లితెరపై న్యూస్ రీడర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎదిగింది ప్రియా భవానీ శంకర్. పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. కాలేజ్ డేస్ నుంచే రాజవేల్‌తో ప్రేమలో ఉన్న ప్రియా.. ఇన్నేళ్లుగా తమ రిలేషన్‌ను కంటిన్యూ చేస్తోంది. గతేడాది ఇద్దరూ కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కూడా చేశారు.
అప్పట్లో పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు త్వరలోనే ఉంటుందని ప్రియా బదులిచ్చింది. అయితే, ఇప్పుడు సర్ప్రైజ్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి సీక్రెట్‌గా జరిగినా, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించేందుకు ఈ జంట ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.