Mohan Babu: రోజులో 5 గంటలు తిండిగురించే మాట్లాడతాడు.. మోహన్ బాబుపై సెటైర్ వేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

Published : Nov 11, 2026, 11:44 AM IST

Mohan Babu: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఎంత సీరియస్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్ బాబుతో మాట్లాడటానికే చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఓ డైరెక్టర్ మాత్రం మోహన్ బాబు పై సెటైర్లు వేశాడని తెలుసా?

PREV
13
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే హీరోగా డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు పేరుంది. ఎంతటి వారైనా సరే.. మోహన్ బాబు అనాలనుకున్న మాట అనేస్తాడు. మోహన్ బాబుతో మాట్లాడానికే చాలామంది భయపడుతుంటారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడా అని జంకుతుంటారు. మోహన్ బాబు కూడా చాలా సందర్భాల్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నారు. అటువంటి మోహన్ బాబుపైనే సెటైర్ వేసే దర్శకుడు ఉన్నాడంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ.

23
సంచలనాల డైరెక్టర్ తో అనుబంధం..

మంచు మోహన్ బాబు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో వీరిద్దరి మధ్య ఉండే స్నేహం గురించి కూడా అందరికి తెలిసిందే. వర్మ కూడా కేరాఫ్ కాంట్రవర్సీగా ఉండేవారు. ఇక ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు చేసుకునే సరదా కామెంట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఓ సందర్భంలో రామ్ గోపాల్ వర్మ మోహన్ బాబుపై వేసిన సెటైర్.. ఇప్పటికీ వైరల్ అవుతుంది. కలెక్షన్ కింగ్ ఆహారపు అలవాట్ల గురించి, ఆయనతో తన అనుభవాల గురించి వర్మ చాలా విషయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

33
మోహన్ బాబు గురించి ఆర్జీవీ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... మోహన్ బాబుకు తిండిపై ఉండే ఇంట్రెస్ట్ గురించి గురించి చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు. "మోహన్ బాబు గారు రోజులో 12 గంటలు మెలకువగా ఉంటే, అందులో సుమారు 5 గంటలు తినడం గురించిన చర్చలే జరుగుతుంటాయి. షూటింగ్ సమయంలో మోహన్ బాబు సెట్స్‌లో అందరికీ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటారు. మాట్లాడితే 'అమ్మ తినమ్మా' అంటూ తేగలు, వేరుశనక్కాయలు, వడలు ఇలా ఏదో ఒకటి ప్రతి 15 నిమిషాలకి ఒకసారి తెచ్చి ఇస్తూనే ఉంటారు.

ఇదంతా చూసి సార్, మేకలు, గొర్రెలే సార్ ఇలా కంటిన్యూస్‌గా తింటూనే ఉంటాయి" అని నేను అన్నాను. వెంటనే మోహన్ బాబు గారు నవ్వుకుంటూ... "వర్మ, నువ్వు మాత్రం భలే భలే చెప్తావు భలే చెప్పావు" అంటూ నవ్వుకునేవారు'' అని తనదైన శైలిలో ఆర్జీవీ అన్నారు.

ఆర్జీవీ - మోహన్ బాబు కాంబో సినిమా

దర్శకత్వంలో వైవిధ్యాన్ని కోరుకునే రామ్ గోపాల్ వర్మ, పవర్ ఫుల్ నటనకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మోహన్ బాబు కలయికలో ఒక సినిమా మాత్రమే వచ్చింది. రౌడీ టైటిల్ తో తెరకెక్కిన ఈసినిమాలో మంచు విష్ణు హీరోగా నటించగా.. మోహన్ బాబు పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు. ఈమూవీ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈసినిమా ఏమాత్రం ప్రభావంచూపించలేకపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories