తెలుగులో `ధర్మచక్రం, `దేవి,` `ఓంకారం`, `మా ఆవిడ కలెక్టర్,` `పోలీస్ పవర్`, `ధీర్ఘ సుమంగళి భవ`, `రాయలసీమ రామన్న చౌదరీ`, `దేవి పుత్రుడు`, `చిరునవ్వుతో రా` వంటి చిత్రాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. సౌందర్యాకి సమకాలీకురాలిగా మెప్పించారు. ముఖ్యంగా దేవి పాత్రలు ఆమెకి విశేషం గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే తాను డబ్బుకు ఏరోజు ప్రయారిటీ ఇవ్వలేదని, మంచి పాత్రలకే ప్రయారిటీ ఇచ్చినట్టు చెప్పారు. నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుని సెలక్టీవ్‌గా చేశానని చెప్పారు. మళ్లీ మంచి పాత్రలతో తెలుగులోకి వస్తానని వెల్లడించారు. తనకు క్యాన్సర్ అనే వార్తలో నిజం లేదని, కేవలం పుకారు మాత్రమే అన్నారు.