తల్లైనా తగ్గని అందం.. స్లీవ్ లెస్ డ్రెస్ లో ప్రణీతా సుభాష్ మెరుపులు.. మతిచెడగొట్టేలా మత్తు ఫోజులు

First Published | Jul 9, 2023, 3:22 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తరుచుగా గ్లామర్ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది.
 

గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘బావ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో మెరిసింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించిన ప్రణీతా మరింత క్రేజ్ దక్కింది. ఈ సినిమాతో బుట్టబొమ్మగానూ బిరుదు అందుకుంది. ఆపై ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో మెరిసింది. బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించింది. 
 


ఇదిలా ఉంటే.. ప్రణీతా మొదటి లాక్ డౌన్ లోనే పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఈ ముద్దుగుమ్మ వివాహం జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా బంధువులు, కుటుంబీకుల సమక్షంలో వివాహ వేడుక ముగిసింది. 
 

గతేడాది పండంటి ఆడబిడ్డకు కూడా ప్రణీతా సుభాష్ జన్మనిచ్చింది. ఇక పెళ్లి, ప్రెగ్నెన్సీ  కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రణీతా ఇప్పుడు కెరీర్ పైన ఫోకస్ పెట్టింది. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ఈ మేరకు తన బ్యూటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటోంది. 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అందాల వల విసురుతోంది. కొద్దిరోజులు ప్రణీత గ్లామర్ విందు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

తాజాగా పిక్స్ లో ప్రణీతా కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు స్లీవ్ లెస్ అందాలతో, థైస్ గ్లామర్ తో మైమరిపించింది. గుచ్చే చూపులు, కవ్వించే పోజులతో మంత్రముగ్ధులను చేసింది. దీంతో నెటిజన్లు పిక్స్  ను లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep148లో నటిస్తోంది.

Latest Videos

click me!