సినిమా రంగంలో ఫేమస్ అయ్యేంత వరకే కష్టాలు.. టాలెంట్ తో ఎదిగి.. కాస్త ఇమేజ్ వస్తే చాలు.. డిమాండ్ ఆటోమాటిక్ గా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. తొందరగా ఫలితం చూపిస్తుంది. ఎందుకంటే వారి కెరీర్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మంచి ఫామ్ లో ఉండగానే సంపాదించుకోవాలి అని చూస్తుంటారు తారలు. ఆఫార్ములాను బాగా వంటబట్టించుకున్నట్టుంది మృణాల్ ఠాకూర్ తాజాగా తన రెమ్యూరేషన్ పెంచేసిందట.