బ్లాక్ శారీలో ప్రణీతా సుభాష్ బ్యూటీఫుల్ స్టిల్స్... చీరకట్టులో నడుము అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బుట్టబొమ్మ

First Published | Jun 6, 2023, 12:17 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిపోతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. లేటెస్ట్ పిక్స్  లో బుట్టబొమ్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

బ్యూటీఫుల్ హీరోయిన్, కన్నడ భామ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. తొలుత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘బావ’ చిత్రంతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. 
 

తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినప్పటికీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది ప్రణీత. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాలు మరింతగా క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. 
 


ఇదిలా ఉంటే.. 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లి చేసుకుంది. ఇరు సంప్రదాయ పద్ధతుల్లో వెడ్డింగ్ జరిగింది. కోవిడ్ కారణంగా ఎలాంటి ఆడంభరాలు లేకుండా వివాహ వేడుక ముగిసింది. ఇక గతేడాది జూన్ 10న పండంటి ఆడబిడ్డకు కూడా ప్రణీత జన్మనిచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొందింది.

కొద్దికాలం భర్త, కూతురు, కుటుంబ సభ్యులతో సమయం గడిపిన ప్రణీత మళ్లీ కెరీర్ పైన ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అందాల రచ్చ చేస్తోంది. పెళ్లై, కూతురు పుట్టిన ఏమాత్రం తగ్గని గ్లామర్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో దర్శనమిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలకు సరిపడేలా చీరకట్టి అందాలను ప్రదర్శించింది. చీరలో హోయలో పోతూ కుర్ర గుండెలు అదిరిపడేలా ఫోజులిచ్చింది. చిట్టి నడుమును చూపిస్తూ.. మత్తు కళ్లతో గుచ్చేలా చూస్తూ నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. తన బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. 

ప్రస్తుతం ప్రణీత పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్  లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ప్రణీత సినిమాల విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ కన్నడలో రూపుదిద్దుకుంటున్న ‘రమణ అవతార’లో నటిస్తోంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ అక్కడి సూపర్ స్టార్ దిలీప్ 148వ చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. 

Latest Videos

click me!