‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పరిచయం అయ్యింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించి ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తొలిచిత్రంతోనే సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.
అయితే, అలియా భట్ - రన్బీర్ కపూర్ కొన్నేండ్ల పాటు డేటింగ్ లో మునిగిపోయారు. గతేడాది 2022 ఏప్రిల్ 14న హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ముంబైలో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
గతేడాది నవంబర్ లోనే అలియా తన పండంటి ఆడబిడ్డ రాహాకు జన్మిచ్చింది. ప్రస్తుతం కూతురు, భర్త రన్బీర్ తో చాలా హ్యాపీగా ఉంది. మరోవైపు కేరీర్ పైనా శ్రద్ధ పెట్టింది. అయితే అలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది అలియా. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకుల్లో అలియా బోర్ కొట్టించిన సందర్భాన్ని తాజాగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అదేంటో కాదు.. అలియాకు చేతులకు మెహందీ పెట్టడం.. ఆ సమయంలో చిన్నపాప ఒకే దగ్గర కూర్చోవడం తనకు బోర్ కొట్టిందని చెప్పుకొచ్చింది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే అలియా భట్ తన గ్లామర్ తోనూ కట్టిపడేస్తోంది. తాజాగా చీరకట్టులో మంత్రముగ్దులను చేసింది. షోల్డర్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ఎద సొగసుతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మైమరిపించింది.లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అలియా భట్.. హిందీలో ‘డార్లింగ్స్’, ’బ్రహ్మస్త్ర‘లో నటించి ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కూడా విడుదలకు సిద్దం అవుతోంది.