Poorna: గ్రాండ్‌గా పూర్ణ సీమంతం.. కుందనపు బొమ్మలా కట్టిపడేస్తున్న `ఢీ` భామ.. ఫోటోలు వైరల్‌..

Published : Jan 30, 2023, 01:58 PM ISTUpdated : Jan 30, 2023, 02:36 PM IST

`ఢీ` భామ, నటి పూర్ణ త్వరలో తల్లి కాబోతుంది. ఆమె తాజాగా సీమంతం చేసుకుంది. గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
114
Poorna: గ్రాండ్‌గా పూర్ణ సీమంతం.. కుందనపు బొమ్మలా కట్టిపడేస్తున్న `ఢీ` భామ.. ఫోటోలు వైరల్‌..

పట్టు చీరలో ఉన్న పూర్ణ కుందనపు బొమ్మలా ఉంది. సీమంతం కోసం ఆమె ముస్తాబైన తీరు ఆకట్టుకుంటుంది. అందుకు ప్రత్యేకమైన టీమ్‌ పనిచేయడం విశేషం. సీమంతంలో ఆనందంతో ఉప్పొంగిపోయింది పూర్ణ. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

214

పూర్ణ గతేడాది దుబాయ్‌ బేస్డ్ కేరళాకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జూన్‌లో వీరి వివాహం రహస్యంగా జరిగింది. ఆ తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ చేసుకున్నారు. ఆ వీడియోని తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పంచుకుంది. 

314

ఇప్పుడు సీమంతంకి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్‌లో అభిమానులతో షేర్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోతోపాటు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బేబీ బంప్‌తో పూర్ణ ఎంతో అందంగా, బుట్టబొమ్మలా ఉంది. 
 
414

ఈ సీమంతం వేడుకలో పూర్ణ ఫ్యామిలీ మెంబర్స్‌, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఏ మహిళా అయినా గర్భంలో ఉన్నప్పుడు, జన్మనిచ్చినప్పుడు అత్యంత ఆనందాన్ని పొందుతుంది. జీవితంలో వారికి ఆ సమయంలో మించిని ఆనందం మరేది ఉండదు. పూర్ణ ఇప్పుడు ఆ మధుర క్షణాలను అనుభవిస్తుంది. 
 
514

పూర్ణ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆమె `సీమటపాకాయ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `అవును` సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇందులో కాస్త ఇంటెన్స్, బోల్డ్ రోల్‌ చేసింది. అందరిని ఆశ్చర్యపరిచింది. 
 
614

అ తర్వాత పలు సినిమాలు చేసినా ఆ స్థాయి పేరు తీసుకురాలేకపోయింది. అదే సమయంలో ఆమె చిన్న సినిమాలకు పరిమితమయ్యింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేస్తుంది. 
 
714

చాలా రోజులుగా సక్సెస్‌ లేని పూర్ణకి ఇటీవల మంచి విజయాలు దక్కాయి. `దృశ్యం2`, `తలైవి`, `అఖండ` చిత్రాలతో మెప్పించింది. ముఖ్యంగా `అఖండ` చిత్రం ఆమెకి పెద్ద సక్సెస్‌ని అందించింది. ఇందులో బోల్డ్ రోల్‌లో కనిపించినా నటిగా మంచి మార్కులే దక్కించుకుంది. 
 
814

ప్రస్తుతం ఆమె `సువర్ణ సుందరి`తో మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. ఈ సినిమా విడుదలకు రెడీ గా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. నేడు ట్రైలర్‌ రానుంది. ఇందులో పూర్ణ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. 
 
914

మరోవైపు పూర్ణ `ఢీ` షోతో విశేషమైన గుర్తింపు, క్రేజ్‌ని తెచ్చుకుంది. ఇందులో ఆమె జడ్జ్ గా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షో తనకు కెరీర్‌ పరంగా హెల్ప్ అయ్యిందని ఓ సందర్భంలో చెప్పింది పూర్ణ. ఇదిలా ఉంటే ఇప్పుడు మ్యారేజ్‌ తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ రాణిస్తుంది. 

1014

`ఢీ` భామ, నటి పూర్ణ త్వరలో తల్లి కాబోతుంది. ఆమె తాజాగా సీమంతం చేసుకుంది. గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
1114

`ఢీ` భామ, నటి పూర్ణ సీమంతం ఘనంగా జరిగింది.  గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
1214

`ఢీ` భామ, నటి పూర్ణ సీమంతం ఘనంగా జరిగింది.  గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1314

`ఢీ` భామ, నటి పూర్ణ సీమంతం ఘనంగా జరిగింది.  గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1414

`ఢీ` భామ, నటి పూర్ణ సీమంతం ఘనంగా జరిగింది.  గ్రాండ్‌గా జరిగిన ఈ సీమంతం వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories