Malli: స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించిన మల్లీ.. శరత్ ని మాటలతో బాధపెట్టిన మీరా?

First Published Jan 30, 2023, 1:56 PM IST

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు జనవరి 30వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో మాలిని, అరవింద్ మళ్లీ రిజల్ట్ చూసినప్పటి నుంచి చాలా డల్ అయిపోయాడు అత్తయ్య. అరవింద్ మల్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు కదా అనడంతో అప్పుడు మల్లీ నన్ను క్షమించండి బాబు గారు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నేను కుండలు చేసుకోవడానికి, కూలి పనులు చేయడానికి తప్ప కలం పట్టుకోవడానికి పనికిరాను. మా అమ్మ నువ్వు కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అంటే అయిపోయినట్టే అని అనుకునేదాన్ని, నేను బాగా చదువుకోవాలి అని మీరు కూడా నాకు పనులు చెప్పే వాళ్ళు కాదు. ఇక నుంచి నేను చదువుకోలేను కదా అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి మీ అందరికీ భారం కావాలి అనుకోవడం లేదు.
 

అందుకే నేను మా ఊరికి వెళ్ళిపోతాను అనడంతో వెంటనే అరవింద్ వల్ల అక్క ఊరికి వెళ్లి ఏం చేస్తావు మల్లీ మీ అమ్మను బాధ పెడతావా అని అడుగుతుంది. ఇక్కడే ఉండు మళ్ళీ అని అనడంతో వెంటనే మాలిని ఇక్కడే ఉండి మళ్ళీ ఏం చేస్తుంది వదిన. మల్లీకి చదువు రానప్పుడు సరిగ్గా చదువుకోలేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలము ఒకవేళ మల్లీ చదువుకుంటే మనం కూడా మంచి కాలేజీలో చేర్పించే డబ్బు కట్టగలమని అంటుంది మాలిని. అప్పుడు మల్లీ గతంలో మాలిని అన్న మాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు అని అరవిందు వల్ల అమ్మ అనడంతో ఏం లేదు అత్తయ్య సింపుల్ మల్లీ కి ఎలాగో ఫ్యామిలీ లేదు.
 

వాళ్ళ అమ్మ కూడా పెద్దగా చదువుకోలేదు. కాబట్టి మనమే కాస్త చొరవ తీసుకొని మల్లీకి ఇంకొక పెళ్లి చేద్దాము ఒక ఇంటికి పంపిద్దాము అనడంతో మల్లీ షాక్ అవుతుంది. మల్లీ ఇక్కడితో తన జీవితం అయిపోయిందని బాధపడుతుంది కాబట్టి ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి మల్లీకి పెళ్లి చేద్దాము అని అంటుంది మాలిని. ఇక్కడితో జీవితం ఆగిపోదని ఇంకా జీవితం ఉంది అని తనకు తెలిసేలా చేద్దాము మీరందరూ ఏమంటారు అని అనడంతో ఇంట్లో అందరూ ఒకే అని అంటారు. అరవింద్ నువ్వేమంటావు అని అనగా మల్లీ కి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోనమ్మ అని అంటాడు. ఎందుకు అరవింద్ అని అనడంతో మళ్లీ ఎగ్జామ్ లో పాస్ అయ్యింది అనగా అబద్ధం చెప్పకండి బాబు గార.
 

 ఈ క్షణం నన్ను ఓదార్చడానికి అలా చెప్పినా అది నిజం అవ్వదు కదా అనడంతో నేను చెప్పేది నిజం మళ్ళీ నువ్వు పాస్ అవ్వడం కాదు స్టేట్ సెకండ్ ర్యాంకు వచ్చావు అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు జోక్ చేయకు అరవింద్ అని మాలిని అనడంతో అప్పుడు మల్లీ రిజల్ట్ చూపించడంతో ఆ రిజల్ట్ చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు మల్లీ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు అందరు సంతోషపడుతూ ఉండగా మల్లీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మల్లీ అందరి దగ్గరికి వెళ్లి హగ్ ఇస్తూ సంతోషపడుతూ ఉంటుంది. నా సంతోషానికి కారణమైన బాబు గారు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటుంది.
 

మరొకవైపు సత్య ఊరందరికీ స్వీట్లు పంచుతూ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు సత్య మీరా దగ్గరికి వెళ్తాడు. మీరాకి అసలు విషయం చెప్పడంతో మీరా సంతోషపడుతూ ఉండగా మీరా వాళ్ళ అమ్మ కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక అతను అక్కడికి వచ్చి మీరా నీకు పట్నం నుంచి ఫోన్ వచ్చింది ఎవరో శరత్ అంట అని చెప్పడంతో సత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు సత్య కోపంతో వెళ్తాడు. అప్పుడు మీరా వాళ్ళ అమ్మ నీకోసం నీ కూతురు కోసం సత్య తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పో పోయి నీ పట్నం మొగుడితో మాట్లాడుకో పో. ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా పొద్దుగుకులు మాట్లాడుకుంటూ ఉంటున్నావు అనడంతో మీరా ఎమోషనల్ అవుతుంది.

అప్పుడుమీరా,శరత్ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళగా మీరా మన అమ్మాయి స్టేట్లో సెకండ్ ర్యాంకు వచ్చింది అనడంతో మీరా బాధతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక తండ్రిగా ఆనందాన్నితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అనడంతో మల్లీ మీద ప్రేమ ఇన్ని రోజులకు పుట్టుకొచ్చిందా బాబు గారు అని అంటుంది. చెట్ల మధ్య పుట్టిన ప్రేమ ఆరోజు చచ్చిపోయింది. ఆరోజు విడిచి వెళ్లిపోయారు ఆ తర్వాత మేము చచ్చేమో బతికేమో కూడా పట్టించుకున్నారా అంటుంది. మీరేం మాట్లాడకండి బాబు గారు ఈరోజు మన అమ్మాయి మన బిడ్డ అంటున్నారే ఇన్నేళ్లు ఆ ప్రేమ ఎక్కడికి పోయింది అని నిలదీస్తుంది మీరా.

 మీరు తప్పు చేసిన అంత అప్పుడు దాన్ని చేసి నా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకోకుండా చేశారు. ఇన్నేళ్లు మేము ఎలా బతికేమో మమ్మల్ని అలాగే బతకనివ్వండి అని అంటుంది మీరా. అప్పుడు శరత్ తో ఎమోషనల్ గా మాట్లాడుతుంది మీర. ఇలా ఏదో ఒక వంకతో నాకు ఫోన్ చేయమాకండి. నా కూతురు జోలికి రాకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీరా. అప్పుడు మీర ఫోన్ కట్ చేసి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు శరత్ కూడా బాధపడుతూ ఉంటారు.

click me!