బేబీ బంప్ చూపిస్తూ పూర్ణ కళ్ళు చెదిరే ఫోజులు.. మహాలక్ష్మిలా ఆ మెరుపులు చూశారా, వైరల్ పిక్స్

First Published Feb 1, 2023, 12:21 PM IST

గత ఏడాది పూర్ణ తన స్నేహితుడు షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ తాను గర్భవతిని అని ప్రకటించింది.

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ పూర్ణ మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది. 

అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ షోలో అందరిని ఆకర్షిస్తోంది పూర్ణ. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది . 

గత ఏడాది పూర్ణ తన స్నేహితుడు షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్ణ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ తాను గర్భవతిని అని ప్రకటించింది. అంటే త్వరలో పూర్ణ, షానిద్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. 

గత ఏడాది జూన్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రస్తుతం పూర్ణ నిండు గర్భిణి. దీనితో ఇటీవలే ఆమె సీమంతం ఘనంగా జరిగింది. సీమంతం కోసం ధరించిన చీరలో పూర్ణ తన బేబీ బంప్ చూపిస్తూ మహాలక్ష్మిలా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

పూర్ణ నిండైన చీరలో ఆభరణాలు ధరించి చిరునవ్వులతో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. పూర్ణ దేవతలానే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్. నాకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్యూ అంటూ పూర్ణ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. పూర్ణ హీరోయిన్ గా కొంతకాలం రాణించింది. ఆ తర్వాత బుల్లితెర కార్యక్రమాలు ఎంచుకుంది. ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూ మరోసారి వెండితెరపై ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉండగా పూర్ణ గత ఏడాది దృశ్యం 2, అఖండ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం పూర్ణ నాని దసరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని తిరిగి నటిగా మరో ఇన్నింగ్ ప్రారంభించబోతోంది పూర్ణ. అభిమానులంతా పూర్ణ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని విష్ చేస్తున్నారు. 

click me!