సమంత ‘శాకుంతలం’ మళ్లీ వాయిదా? `పఠాన్‌` దెబ్బా.. త్రీడీ దెబ్బా..? అంతా అయోమయం?

First Published | Feb 1, 2023, 12:20 PM IST

స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘శాకుంతలం’ వాయిదా పడనుందని తెలుస్తోంది. ఆయా కారణాలతో థియేట్రికల్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందంటున్నారు. 
 

‘యశోద’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సమంత (Samantha) నెక్ట్స్ మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 17న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ తాజాగా రిపోర్టు ప్రకారం.. రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని  సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి మార్చి లేదా సమ్మర్ 2023కి పోస్ట్ పోన్ కానుందని అంటున్నారు. 
 

ఇంతకీ ‘శాకుంతలం’ విడుదలను వాయిదా వేయాల్సిన సిట్యూయేషన్ ఏముందని పరిశీలిస్తే.. బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’  జోష్ తగ్గకపోవడమే అని అంటున్నారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊపూపుతోంది. రెండో వారంలోనూ ఏమాత్రం Pathaan సందడి తగ్గలేదు. రూ.1000 కోట్ల క్లబ్ దిశగా పయనిస్తోంది. దీంతో పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రాబోతున్న Shaakuntalam చిత్రాన్నికి నార్త్ లో థియేటర్ల సమస్య నెలకొంది. `పఠాన్‌`జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆశించిన స్థాయిలో అక్కడ థియేటర్ల దొరకడం లేదని అంటున్నారు.
 


ఈ మేరకు బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’ రిలీజ్ కూడా ‘పఠాన్’ దెబ్బకు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 17కు వారం పాటు వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పాన్-ఇండియన్ చిత్రంగా విడుదలవుతున్న `శాకుంతలం` నార్త్ బెల్ట్‌లలో తగినంత స్క్రీన్‌లను పొందకపోవచ్చని అంటున్నారు. 

మరోవైపు  పోస్ట్ ప్రొడక్షన్  పనులు కూడా పూర్తి కాకపోవడం కారణంగానూ  విడుదలను వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందని టాక్ వినిపిస్తోంది. త్రీడీ వర్క్ ఇంకా కంప్లీట్‌ కాలేదని భోగట్టా. దీంతో పోస్ట్ పోన్‌ చేయాలని యూనిట్‌ భావిస్తుందట. ఇప్పటికే గతేడాది ఆగస్టు 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈనెల ఫిబ్రవరి 17కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రటకన రాలేదు. మరోవైపు ఇవ్వాళ రావాల్సిన థర్డ్ సింగిల్ ‘ఏలేలో ఏలేలో’కూడా పోస్ట్ పోన్ చేశారు. ప్రెస్‌ మీట్‌ని కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్‌ చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై గందరగోళం నెలకొంది. 

పురాణాల ఆధారంగా తెరకెక్కబోతున్న ‘శాకుంతలం’లో సమంత  - దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో చిత్రం రూపుదిద్దుకుంటోంది. గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా  నిర్వహిస్తున్నారు.  కానీ రిలీజ్‌కి సంబంధించిన కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతుంది.

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూ అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో చిత్రాన్నివిడుదల చేబోతున్నారు. విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని తెలుస్తోంది. 
 
 

Latest Videos

click me!