చెప్పుకోలేనిచోట దాడి చేశారు.. సంచలన విషయాలు వెల్లడించిన హీరోయిన్ ఫోరా సయానీ

First Published Feb 1, 2023, 11:09 AM IST

ఇండస్ట్రీలో స్టార్లు గా ఎదిగిన వారి దగ్గర నుంచి.. చిన్న తారల వరకూ ఏదొ ఒక రకంగా వేధింపులు ఎదుర్కొన్న వారే. అయితే కొంత మంది బయట పడుతుంటారు..మరికొంత మంది మాత్రం లోలోపల కుమిలిపోతుంటారు. 

నాలుగైదేళ్లుగా కాస్టింగ్ కౌచ్ బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. రీసెంట్ గా మరో హీరోయిన్ తనకు జరిగిన దారుణ అనుభవాలను వెల్లడించింది. ఓ నిర్మాత చేసిన పనికి తాను ఎలా ఇబ్బంది పడింది వివరించింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్, టాలీవుడ్  నటి ఫ్లోరా సయానీ. 
 

తెలుగు ఆడియన్స్ కు ఆశా సైనీ గా సుపరిచితమైన నటి.. బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ కోసం, అంతా మనమంచికే, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. 
 

రీసెంట్ గా తనకు జరిగిన ఓ దారణ సంఘటన గురించి వివరించింది ఫోరా సయానీ. ఓ నిర్మాత తనను ఎన్ని హింసలు పెట్టాడో వివరించింది. అది కూడా మీటూ ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ఈమెపై తీవ్రమైన లైంగిక దాడి చేసి వేధించాడని వివరించింది. దాదాపు 14 నెలల అతరి చెరలో  నరకం అనుభవించానని  అంటోంది ప్లోరా. 
 

ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది ప్లోరా షైనీ. ఇందులో జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ.. నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. కానీ నా పరిస్థితి అంతలోనే పూర్తిగా మారిపోయింది. అతను నాకు నరకం చూపించాడు. రోజు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అంతటితో ఆగకుండా.. నా ముఖం పై,నా ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా కొట్టేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 

నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేసేవాడు.చివరికి అతని నుండి తప్పించుకుని పారిపోయి బయటకు వచ్చాను. ప్రస్తుతం నాపేరెంట్స్ తో ఉంటున్నాను అన్నారు. అయితే ఇక్కడికివచ్చినా.. తాను కోలుకోవడానికి మాత్రం కొన్ని నెలల సమయం పట్టిందంటోంది బ్యూటీ. 

Photo Credit : Instagram) ఫ్లోరా షైనీ

అన్ని రోజులు నరకం చూసిన నాకు.. నన్ను ఇష్టపడే వారి దగ్గరకు తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది అంటోంది హీరోయిన్.  ఇక సినిమాలు మానేసిన తరువాత ఈ బ్యూటీ డిజిటల్ మీడియా వైపు వెళ్లింది. మెయిడ్ ఇన్ ఇండియా, గాంఢీ బాత్, మాయ నగరి  సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఆర్య వంటి వెబ్ సిరీస్లలో నటిస్తూ వచ్చింది.

click me!