ఈ తీర్పు పై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె తీర్పుకు మద్దతు ఇస్తూనే కొందరు ఆడవాళ్ళ తీరును తప్పుబడ్డారు. గర్భం దాల్చిన ప్రతి మహిళకు బిడ్డను కనాలా? లేదా? అని నిర్ణయించుకునే హక్కు ఉంది. చాలా మంది ఆడవాళ్లు గర్భం దాల్చడం సామాజిక, ఆర్థిక భద్రత గా భావిస్తున్నారు. బయట ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న మగాళ్లను రిలేషన్ కి కట్టుబడి ఉండేలా చేయడానికి గర్భాన్ని వాడుతున్నారు. ఆడవాళ్లు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తమ స్వార్థ ప్రయోజాలకు ఉపయోగించకూడదు, మతపరమైన సంస్థలు అబార్షన్ ని తప్పుడు చర్యలకు వాడుతున్నారని, అన్నారు