Anushka Shetty: నందమూరి బాలకృష్ణ హీరోగా, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఒక్క మగాడు’. అనుష్క కెరీర్ తొలినాళ్లలో ఈ సినిమాలో విడుదలైంది. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఒక్క మగాడు’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ చిత్రాలైతే అభిమానులకు ఫీస్ట్ అని చెప్పొచ్చు. 'అరుంధతి' సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా మంచి బిజినెస్ తెచ్చిపెట్టిన అనుష్క.. క్రమంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాహుబలి 1 & 2 చిత్రాలతో అనుష్కకు ప్యాన్ ఇండియా స్టేటస్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో ఓ పెద్ద తప్పు చేశానంటోంది అనుష్క.
25
బాలయ్యతో ఆ సినిమానే..
బాలకృష్ణతో చేసిన ఒక్క సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని స్వీటీ చెబుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. నందమూరి బాలకృష్ణ హీరోగా, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క మగాడు’. కెరీర్ తొలినాళ్లలో ఉండగా అనుష్క ఈ చిత్రం చేసింది. 2008వ సంవత్సరంలో ఈ ‘ఒక్క మగాడు’ థియేటర్లలో విడుదలై అట్టర్ ప్లాప్‌గా మారింది. ఆ సమయంలో బాలకృష్ణ – వైవియస్ చౌదరి కాంబినేషన్ క్రేజ్ ఉండటంతో.. కథను పూర్తిగా వినకుండానే, తన పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోకుండానే ఈ సినిమాకు ఒప్పుకున్నానని అనుష్క స్పష్టం చేసింది.
35
బాక్సాఫీస్ దగ్గర బోల్తా..
అప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అలాగే ఓ పాటలో అనుష్క ఫుల్ గ్లామరస్‌గా కనిపిస్తోంది. దీని వల్ల అప్పట్లో అనుష్కపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ ఒక్క పాట అనుష్కను అభాసుపాలు చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. బాలకృష్ణతో పని చేయడం తనకు మంచి అనుభవమేనని అనుష్క తెలిపింది. కథ, తన పాత్ర నిడివిని పూర్తిగా తెలుసుకోకుండా ఒప్పుకోవడం తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానని స్పష్టం చేసింది. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నానని.. ఆ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చానని తెలిపింది.
55
ప్రభాస్‌తో స్నేహం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య పెళ్లి వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ కూడా వట్టి పుకార్లు మాత్రమే. ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండగా.. ఇద్దరూ కూడా బ్యాచిలర్స్ కావడంతోనే ఎప్పటికప్పుడు ఏదొక రూమర్ పుట్టుకొస్తోంది. ఇక అటు ప్రభాస్, ఇటు అనుష్క.. ఇద్దరూ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.