Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్

Published : Oct 13, 2026, 04:54 PM IST

Nidhhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు అబ్బాయిల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను పుట్టింది హైదరాబాద్‌లోనే అని, తెలుగు అబ్బాయిలంటే తనకు చాలా ఇష్టమని, పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పింది.

PREV
14
టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల హవా

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తోంది. వరుస సినిమాలు చేస్తూ, హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త అవకాశాలు దక్కించుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ బ్యూటీ కూడా ఇప్పుడు సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.

గ్లామర్, యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్.. తాజాగా తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వరుస సినిమాలు చేస్తున్నా, ఓ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ భామ.. ఇప్పుడు ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం గురించి ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

24
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే!

రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిధి అగర్వాల్‌కు రిపోర్టర్ల నుంచి తన పర్సనల్ లైఫ్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి. 'మీరు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా?' అని ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి నవ్వుతూనే సమాధానం ఇచ్చిన నిధి.. తాను పుట్టింది హైదరాబాద్‌లోనే అని, పుట్టుకతోనే తాను తెలుగు అమ్మాయినని చెప్పింది.

అంతేకాదు, తెలుగు అబ్బాయిలంటే తనకు చాలా ఇష్టమని, బహుశా ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చని ఓ హింట్ కూడా ఇచ్చింది. నిధి అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతున్నాయి. అయితే, తన పెళ్లిపై ఆమె ఎలాంటి ఫైనల్ డెసిషన్ చెప్పలేదన్నది ఇక్కడ గమనించాలి.

34
హైదరాబాద్‌తో స్పెషల్ బాండింగ్!

సినిమా అవకాశాల కోసం వేరే సిటీల్లో ఉండటం హీరో హీరోయిన్లకు కామనే. కానీ, నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌తో ఓ స్పెషల్ బాండింగ్ ఉందని ఆమె మాటల ద్వారా మరోసారి అర్థమైంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లు చెప్పిన నిధి.. ఈసారి బతుకమ్మ పండుగను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టింది. తెలుగు సంస్కృతి, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని ఆమె ఇలా పంచుకోవడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

44
ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన క్రేజ్

2017లో రిలీజైన హిందీ సినిమా ‘మున్నా మైఖేల్’తో నిధి అగర్వాల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైంది. రామ్ పోతినేనితో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది.

ఇప్పుడు సినిమాల కంటే నిధి అగర్వాల్ పెళ్లి కామెంట్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. తెలుగు అబ్బాయిలపై ఆమె చూపించిన ఇష్టం ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచింది. దీంతో ఆమె నెక్స్ట్ సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా నెట్టింట తెగ మాట్లాడుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories