Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!

Published : Oct 13, 2026, 03:35 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు, డైలాగులు, స్టెప్పులు, మేనరిజమ్ తో పాటు ఆయన పాడిన పాటలు కూడా ప్రత్యేకమే. మరి పవర్ స్టార్ ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు? వాటిలో ప్రత్యేకత ఏంటో చూద్దాం.

PREV
16
పవన్ కళ్యాణ్ పాడిన పాటలు

సాధారణంగా హీరోలు అప్పుడప్పుడు తమ సినిమాల్లో పాటలు పాడి అభిమానుల్లో జోష్ పెంచడం సహజమే. అయితే పవన్ అప్పట్లోనే సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన స్టైల్‌లో పాటలు పాడుతూ అభిమానులను అలరించారు. కొన్ని పాటలు అప్పట్లోనే సూపర్ హిట్ కాగా, మరికొన్ని మాత్రం పవన్ అభిమానుల్లో ఇప్పటికీ స్పెషల్‌గా నిలిచిపోయాయి. మరి పవర్ స్టార్ ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు? ఏ సినిమాలో పాడారో ఇక్కడ తెలుసుకుందాం.

26
తమ్ముడు సినిమాలోని పాటలు

పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమా నుంచి సింగర్ గా అవతారమెత్తారు. ఆ సినిమాలో “ఏం పిల్లా మాటాడవా”, “తాటి చెట్టు ఎక్కలేవు” అనే పాటలు ఆయన స్వయంగా పాడారు. ముఖ్యంగా “తాటి చెట్టు” పాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా హీరోలు స్క్రీన్‌పై పాటకు లిప్ సింక్ ఇవ్వడం సహజమే అయినా, పవన్ స్వయంగా పాట పాడటం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

36
ఖుషి సినిమాలోని సాంగ్

ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలోని “బై బైయే బంగారు రమణమ్మా” పాటతో పవన్ మరోసారి తన గాన ప్రతిభను చూపించారు. ఆలీతో కలిసి ఆయన చేసిన సరదా ఈ పాటకు మరింత వినోదాన్ని జోడించాయి. పాటలో పవన్ వాయిస్ కంటే కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, పాటను తన మేనరిజమ్స్‌తో నడిపించిన తీరు అభిమానులకు బాగా నచ్చింది. ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో “నువ్వు సారా తాగుట”, “రావోయి మా ఇంటికి” వంటి పాటలను కూడా పవన్ స్వయంగా పాడారు.

46
పంజా సినిమాలోని పాట

ఇక ‘పంజా’ సినిమాలోని “పాపారాయుడు” పాట పవన్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సింగింగ్ మూమెంట్‌గా నిలిచింది. ఈ పాట అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని “కాటమరాయుడా” పాటతో పవన్ మరోసారి తన గొంతుతో ప్రేక్షకులను అలరించారు. అలాగే ‘గుడుంబా శంకర్’ సినిమాలోని “కిల్లీ కిల్లీ” పాటలో కూడా పవన్ కళ్యాణ్ తన గొంతును వినిపించారు. ఈ పాటలో పవన్ పాడిన భాగం ప్రారంభంలో వస్తుంది.

56
అజ్ఞాతవాసిలోని సాంగ్

ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని “కొడకా కోటేశ్వరరావు” పాట పవన్ కళ్యాణ్ సింగింగ్ కెరీర్‌లో అత్యంత పాపులర్ అయిన పాటల్లో ఒకటి. ఫోక్ టచ్, మాస్ బీట్, పవన్ వాయిస్ కలయిక ఈ పాటను అభిమానులకు మరింత చేరువ చేసింది. పవన్ తనకు మాత్రమే సాధ్యమైన మేనరిజమ్స్‌తో పాటను ప్రెజెంట్ చేయడం ఈ సాంగ్‌కు మరింత ప్రత్యేకతను ఇచ్చింది.

66
హరిహర వీరమల్లు మూవీ సాంగ్

అలాగే ‘హరిహర వీరమల్లు’ సినిమాలోని “మాట వినాలి” పాటను కూడా ఆయన స్వయంగా పాడారు. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన గొంతును వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే పవన్ ఎప్పుడూ తన పాత్రకు, తన బాడీ లాంగ్వేజ్‌ కి సెట్ అయ్యేలా తనదైన శైలిలో పాడారు. అందుకే ఆయన పాటల్లో వాయిస్ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ వినిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories