కెరీర్ విషయానికొస్తే.. నేహా శెట్టి ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో, యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల నుంచి వస్తున్న అప్డేట్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. త్వరలోనే షూటింగ్, తదితర కార్యక్రమాలూ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.