నాన్న వారసుడు కావాలన్నాడు, సౌందర్యతో ఎఫైర్ పై జగపతి బాబు సంచలన కామెంట్స్!

First Published | Sep 18, 2023, 7:46 PM IST


దివంగత నటి సౌందర్యతో జగపతిబాబు ఎఫైర్ నడిపాడనే రూమర్ చాలా కాలంగా ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో జగపతిబాబు నిజమే అన్నట్లు మాట్లాడారు. అయితే ఆయన తాజా కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 
 

Jagapathi babu

ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబును యాంకర్ సీరియస్ క్వశ్చన్ అడిగారు. హీరోయిన్స్ తో ఎఫైర్ ప్రశ్నలను మీరు ఎందుకు వ్యతిరేకించరు. ఇలాంటి ప్రశ్నలు పెళ్ళై పిల్లలు ఉన్న హీరోయిన్స్ కి చాలా ఇబ్బంది కదా... వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి కదా.. అని అడిగారు. 

ఈ ప్రశ్నకు సమాధానంగా... మా నాన్న మనకు వారసుడు లేరురా, అందరూ అమ్మాయిలే అన్నాడు. వారసుడు లేకపోతే ఏమవుతుంది నాన్నా అన్నాను. ఉండాలి కదరా అన్నాడు. మనం పోయాక ఏం జరుగుతుందో మనకి తెలియదు. అలాంటప్పుడు వారసుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటీ? అన్నాను. సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ బయట ఎక్కడైనా ట్రై చేయనా అని సరదాగా అన్నాను... 


ఒక పూజారి నా దగ్గరకు వచ్చి ఫలానా హీరోయిన్ ఉంది సార్ మీరు కలవొచ్చు అన్నాడు. అసలు ప్రపంచం ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఇది అసలు అసంబద్ధం అనిపించింది... అన్నారు. ఈ క్రమంలో జగపతిబాబు సౌందర్యతో ఎఫైర్ రూమర్ తెరపైకి తెచ్చాడు. 

జగపతిబాబు మాట్లాడుతూ... సితార పత్రికలో 'జగపతిబాబు సౌందర్యను వివాహం చేసుకోవడం లేదు' అని హెడ్డింగ్ పెట్టి కథనం రాశారు. నేను షాక్ అయ్యాను. అది రాసిన వాడిని అడిగాను. ఇవన్నీ కామన్ సర్ అన్నాడు. వాడి పై వాడిని కలిసినా లాభం లేదు. అప్పుడు నేరుగా రామోజీ రావు దగ్గరకు వెళ్ళాను. 

సర్ ఇలాంటి వార్తలు మీకు అవసరమా? నా విషయం తీసేయండి. నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మంచి మనిషి, టాలెంటెడ్ ఆర్టిస్ట్.. ఆమెకు పెళ్లి అవుతుందా...  అని అడిగాను. నాకు తెలియదు బాబు అన్నాడు. మీకు తెలియదు అంటే ఎలా మీరే ఎడిటర్ కదా అన్నాను. అప్పుడు రామోజీ దాని మీద చర్యలు తీసుకున్నాడు. 

ఇటీవల రుద్రంగి సినిమాను ప్రమోట్ చేయమని ప్రియమణిని అడిగాను. ఆమె ఓ వీడియో చేసింది. బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి.  ప్రియమణితో ఒకడు డిస్కషన్ పెట్టుకున్నాడు. మీరు ఎందుకు నటించలేదు? జగపతిబాబు మిమ్మల్ని రికమెండ్ చేస్తాడు కదా..? అని అడుగుతున్నాడు. వాటికి ఆమె ఆన్సర్స్ ఇస్తుంది. వాడు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతున్నాడు. నేను ప్రియమణికి ఫోన్ చేసి వదిలేయండి అని చెప్పాను... 

నో ప్రాబ్లం ఇలాంటివి నేను పట్టించుకోను అని ప్రియమణి అంది. అసలు నేను ఆమె హెల్ప్ అడగకుండా ఉండాల్సింది అనిపించింది. హీరోయిన్స్ ఎఫైర్ ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పకపోతే తప్పు చేశామన్న భావన వాళ్లలో ఉంటుంది. అందుకే మీకు ఇష్టం వచ్చింది రాసుకో అనుకుని వదిలేయాలి. ఎవరికీ నేను విడమర్చి చెప్పింది లేదు. పని లేని వాళ్ళు  నచ్చింది రాసుకుంటారు... అని జగపతి బాబు అన్నారు..

సౌందర్య, ప్రియమణి, కళ్యాణి వంటి హీరోయిన్స్ తో జగపతిబాబు రిపీటెడ్ గా సినిమాలు చేశారు. ఈ క్రమంలో వాళ్లతో జగపతిబాబు ఎఫైర్ నడిపారంటూ పుకార్లు ఉన్నాయి. జగపతిబాబుకు వీరి గురించి ప్రశ్నలు తరచుగా ఎదురవుతూ ఉంటాయి... 

Latest Videos

click me!