పింక్ శారీలో ‘డీజే టిల్లు’ హీరోయిన్ మెరుపులు.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న నేహా శెట్టి.. పిక్స్

First Published | May 30, 2023, 6:30 PM IST

‘డీజే టిల్లు’తో మంచి హిట్ అందుకున్న నేహా శెట్టి (Neha Shetty) మరో రెండు చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నెట్టింట నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్  బ్యూటీఫుల్ గా ఉన్నాయి.
 

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ‘మెహబూబా‘ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి తనకు వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందుతూనే ఉన్నాయి. తన అందం, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంది. 
 

చివరిగా  గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి అవుట్ అండ్ కామెడీ, రొమాంటిక్ ఫిల్మ్ ‘డీజే టిల్లు’తో అలరించిన విషయం తెలిసిందే. కాస్తా బోల్డ్ పెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతోనే మంచి హిట్ ను సొంతం చేసుకుంది. మరోవైపు తన పెర్ఫామెన్స్ తో రాధికగానూ గుర్తింపు దక్కించుకుంది.
 


ప్రస్తుతం మరో రెండు తెలుగు చిత్రాలతో యంగ్ బ్యూటీ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది.
 

ఇటీవల నేహా శెట్టికి వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ శారీలో బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

నేహా శెట్టి పంచుకున్న లేటెస్ట్ పిక్స్  లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లిమ్ ఫిట్ అందానికి పింక్ శారీ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసిపోతూ మైమరిపించేలా ఫోజులిచ్చింది. నిషా కళ్లతో కుర్రాళ్ల చూపులను కట్టిపడేసింది. క్యూట్ స్మైల్ తో హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

ఇదిలా ఉంటే నేహా శెట్టి ప్రస్తుతం ‘బెదురులంక 2012’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన నటించింది. జూన్ నెలలో విడుదల కానుంది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ‘రూల్స్ రంజన్’లోనూ నటించింది. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి బ్యూటీఫుల్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. 
 

Latest Videos

click me!