పెళ్ళైన 6 నెలలకే ఎలా బిడ్డని కన్నావు ? తీవ్ర విమర్శలకు నటి సమాధానం.. వివాదంలోకి స్టార్ హీరోయిన్ ని లాగింది

Published : Aug 27, 2025, 10:33 PM IST

పెళ్ళికి ముందే గర్భవతి అయిన తనపై ఇప్పటికీ ట్రోలింగ్ ఆగడం లేదని నటి నేహా ధూపియా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకి తీసి కౌంటర్ ఇచ్చింది. 

PREV
15

బాలీవుడ్ లో పెళ్ళికి ముందే గర్భం దాల్చిన నటీమణులు కొందరు ఉన్నారు. బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా గర్భవతి అయ్యాక వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ముందు తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీతో నేహా ధూపియా రిలేషన్ లో ఉండేది. ఆ సమయంలోనే ఆమె గర్భవతి అయింది. దీనితో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 6 నెలలకి నేహా ధూపియా బిడ్డకి జన్మనిచ్చింది. 

25

దీనితో తరచుగా నేహా ధూపియా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నారు. ఆమె పెళ్లి జరిగి చాలా ఏళ్ళు గడుస్తున్నప్పటికీ పెళ్ళికి ముందే గర్భవతి అయిన విషయాన్ని బయటకి తీసి విమర్శిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేహా ధూపియా తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించింది. 

35

ఈమె పెళ్ళైన ఆరు నెలలకే ఎలా బిడ్డకి జన్మనిచ్చింది అని చాలా మంది విమర్శిస్తుంటారు. నిజమే నేను పెళ్ళికి ముందే గర్భవతిని అయ్యాను. అదేమీ చెడ్డ విషయం అని నేను అనుకోవడం లేదు. నాలాగే అలియా భట్, నీనా గుప్తా లాంటి నటీమణులు కూడా పెళ్ళికి ముందు గర్భవతులు అయ్యారు. కానీ నెటిజన్లు ఎక్కువగా నన్నే ట్రోల్ చేస్తున్నారు. 

45

అంగద్ తో డేటింగ్ ప్రారంభించిన కొంత కాలానికే నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి కాకుండా, డేటింగ్ చేసిన కొద్ది రోజులకే గర్భవతిని కావడం అనేది ఇతరులకు వింతగా ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్స్ కి తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేము. సాంప్రదాయ కుటుంబం అయినప్పటికీ, సంప్రదాయేతర కుటుంబం అయినప్పటికీ ఈ విషయాన్ని బయటకి చెప్పలేం. ఆ సిచ్యుయేషన్ తనకు చాలా కష్టంగా అనిపించింది అని నేహా ధూపియా అన్నారు. 

55

పెళ్ళికి తన క్లోజ్ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయలేదు అని నేహా పేర్కొంది. తనకంటే మూడేళ్లు చిన్నవాడైన అంగద్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం నేహా ధూపియాకి 45 ఏళ్ళు. 

Read more Photos on
click me!

Recommended Stories