ఈ హీరోయిన్ మల్లెపూలు ఎంతపని చేశాయో చూడండి

Published : Sep 08, 2025, 03:00 PM IST

ఈ హీరోయిన్ ను మల్లెపూలు ఎంత ఇబ్బంది పెట్టాయో తెలుసా? 15 సెం.మీ మల్లెపూలు పదులు, వందలు, వేలు కాదు లక్షల ఖరీదు పడ్డాయి. ఈ మల్లెపూల స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
మన హీరోయిన్ మల్లెపూలు మామూలు పని చేయలేదు..

Navya Nair : సౌత్ ఇండియాలో మహిళలు జెడలో పూలు పెట్టుకోవడం సాంప్రదాయం... కానీ కేవలం ఈ అలవాటు ఓ సౌత్ హీరోయిన్ ను ఇబ్బందుల్లో పడేసింది. మల్లెపూలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తానని అనుకున్న హీరోయిన్ అవాక్కయ్యే పరిస్థితి ఎదుర్కొంది. కేవలం ఓ 15 సెంటిమీటర్ల మల్లెపూల దండ ఏకంగా 1,14,000 రూపాయల నష్టాన్ని కలిగించింది... అంతేకాదు ఆ సినీనటిని జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని కొద్దిసేపు భయపెట్టింది. మల్లెపూలేంటి... లక్షన్నర లాస్ చేయడమేంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ హీరోయిన్ కి విదేశాల్లో ఎదురైన అనుభవం గురించి తెలుసుకోవాల్సిందే.

25
ఈ హీరోయిన్ మల్లెపూల స్టోరీ...

మలయాళ, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు హీరోయిన్ నవ్య నాయర్. 2001లో ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అనేక సినిమాల్లో నటించారు. అయితే ఇటీవల మలయాళ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే ఓనం పండగ కోసం నవ్య ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్ బోర్న్ లో జరిగిన ఓనం వేడుకలకు ఆమెను ఆహ్వానించారు అక్కడి మలయాళీలు.

ఇలా కొచ్చి నుండి ఆస్ట్రేలియాకు బయలుదేరేముందు ఈ హీరోయిన్ కు తండ్రి ప్రేమగా మల్లెపూలు అందించారు. ఓనం పండగలో మల్లెపూలు, తెల్లని చీరలతో అమ్మాయిలు ముస్తాబై వేడుకలు జరుపుకుంటారు. అందుకే కూతురికి మల్లెపూలు ఇచ్చాడు ఆ తండ్రి. దీంతో నవ్య ఆ పూలను తన బ్యాగులో పెట్టుకుని ప్లైట్ ఎక్కింది. కానీ ఈ మల్లెపూలే దేశంకాని దేశంలో ఆమెను చాలా ఇబ్బందిపెట్టాయి.

35
15 సెం.మీ మల్లెమాల ఖరీదు రూ.1,14,000?

తండ్రి చెప్పినట్టు ఓనం వేడుకల్లో మల్లెపూలు పెట్టుకోవాలని నవ్య అనుకుంది. కొచ్చి నుండి ఆస్ట్రేలియాకి నేరుగా విమానం లేదు... సింగపూర్‌లో విమానం మారాల్సి ఉంటుంది. అందుకని తండ్రి ఇచ్చిన మల్లెపూల దండను రెండు ముక్కలు చేసింది నవ్య... ఒకటి తలలో పెట్టుకుని, మరొకటి హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. ఆస్ట్రేలియాలో కార్యక్రమానికి వెళ్లే ముందు బ్యాగులోని మల్లెపూల ముక్క జెడలో పెట్టుకోవాలని అనుకుంది.

సింగపూర్‌లో విమానం మారినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు... కానీ మెల్‌బోర్న్ చేరుకున్న హీరోయిన్ నవ్యకు కస్టమ్స్ అధికారులు, పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె బ్యాగ్‌లో 15 సెంటీమీటర్ల మల్లెపూలు దొరకడంతో అధికారులు హంగామా చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆమె మల్లెపూలు తీసుకురావడాన్ని నేరంగా భావించిన కస్టమ్స్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాక నవ్య కంగారుపడిపోయింది.

45
ఇంకా నయం... ఫైన్ తో సరిపెట్టారట

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం... ఇతర దేశాల నుండి వచ్చేవారు పూలు, మొక్కలు తీసుకువస్తు ముందుగానే అనుమతి తీసుకోవాలి. కానీ నవ్య అలాంటి అనుమతులేమీ తీసుకోలేదు... అందుకే ఆమెను ఎయిర్ పోర్ట్ లో ఆపారు అధికారులు. తనకు ఈ విషయం తెలియదని... అందుకే మల్లెపూలు తీసుకువచ్చానని చెప్పడంతో కేవలం జరిమానా విధించి వదిలిపెట్టారు... లేదంటే ఎలాంటి శిక్ష విధించేవారోనని భయపడిపోయినట్లు నవ్య నాయర్ తెలిపారు. 

ఆమెకు 6,600 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే రూపాయల్లో లక్షా 14 వేలు జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ జరిమానా కట్టాలి... లేదంటే జైలు శిక్ష పడుతుంది. నియమం గురించి తెలియక జరిమానా కట్టానని, ఇది తనకు ఒక పాఠమని నవ్య చెప్పుకుంది.

55
ఆస్ట్రేలియాలో మల్లెపూలు నిషేధమా..?

ఆస్ట్రేలియా నియమాల ప్రకారం.. వేరే దేశాల నుండి వచ్చేవారు పూలు, మొక్కలు తెస్తే ముందే చెప్పాలి. ఎందుకంటే వీటివల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశాలుంటాయి. అందుకే ప్రత్యేక అనుమతి ఉంటేనే మెక్కలు, పూలను అనుమతిస్తారు. అంతేగానీ ఆస్ట్రేలియాలో మల్లెపూలపై నిషేదం ఏమీలేదు. హీరోయిన్ నవ్య నాయర్ అనుమతి లేకుండా పూలను తీసుకెళ్ళారు కాబట్టి విమానాశ్రయంలోనే అడ్డుకుని ఫైన్ వేశారు... సరైన అనుమతులుంటే అధికారులు అనుమతించేవారు.

Read more Photos on
click me!

Recommended Stories