పెళ్లి కూతురిలా ముస్తాబై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ‘హిడింబ’ హీరోయిన్ నందితా శ్వేత

First Published | Jul 31, 2023, 2:40 PM IST

యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా (Nandita Swetha)  పెళ్లికూతురులా ముస్తాబై ఆకట్టుకుంటోంది. నిండు దుస్తుల్లో వెలిగిపోతోంది. తన నెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. 
 

కన్నడ బ్యూటీ నందితా శ్వేతా ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో అవకాశం దక్కించుకుంటోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘హిడింబ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా అప్డేట్ అందింది. ఇందులో నందితా బ్యూటీఫుల్ రోల్ ప్లే చేయనున్నట్టు అర్థమవుతోంది. 
 


లేటెస్ట్ గా అభిమానులతో పంచుకున్న ఫొటోస్ ద్వారా  నెక్ట్స్ మూవీలో ఆకట్టుకునే పాత్రలో నటించనుందని తెలుస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి కూతురిలా ముస్తాబై కనిపించింది. గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయింది. ఆకర్షణీయమైన అభరణాలు ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది.
 

అయితే, తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘రణం’ అనే చిత్రంలో నందితా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ ‘హిడింబ’ తర్వాత ‘రా రా పెనిమిటి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 
 

హీరోయిన్ గా వెండితెరపై గ్లామర్ రోల్స్ లో అలరించడంతో పాటు విభిన్న పాత్రలు కూడా పోషిస్తూ మెప్పిస్తోంది. తన అందంతోనే కాకుండా పెర్ఫామెన్స్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. 
 

మొత్తానికి నందితా ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ క్రేజీ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది. మరింతగా క్రేజ్ దక్కించుకుంటోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ పాపులర్ షోస్ ‘ఢీ’, ‘బిగ్ బాస్ తెలుగు’లోనూ మెరిసింది. 
 

Latest Videos

click me!