రెట్రో లుక్ లో ‘జయం’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. కొంటె చూపులతో కవ్విస్తున్న సదా..

First Published | Jul 31, 2023, 1:36 PM IST

‘జయం’ హీరోయిన్ సదా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా రెట్రో లుక్ లో  అట్రాక్ట్ చేసింది. స్టన్నింగ్ ఫోజులతో అదరగొట్టింది.
 

సీనియర్ హీరోయిన్ సదా (Sadha)  స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ నెట్టింట అందాల జాతర చేస్తోంది.  రోజుకో తీరుగా దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. 
 

సినిమాల  పరంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకున్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో అలరిస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. 
 


వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న సదా.. తాజాగా రెట్రో లుక్ లో దర్శనమిచ్చింది. చుక్కల అంగీ, తలకి రిబ్బన్, గ్రీన్ లెహంగా ధరించి వింటేజ్ హీరోయిన్ లా మారిపోయింది. కొంటెగా ఫోజులిస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది. 

నిజానికి రెట్రో లుక్ లో సదా చాలా ముద్దుగా కనిపించింది. అలనాటి హీరోయిన్లకు తన లేటెస్ట్ లుక్ తో గుర్తు చేసింది. అయితే ఈ తరహాలో రెడీ అవ్వడానికి కారణం ఉంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ‘ఢీ’ షోతో ఇదివరకు జడ్జీగా వ్యవహరించి టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘నీతో డాన్స్’ షోతో అలరిస్తోంది.
 

ఈ షో ప్రతి శని, ఆదివారం సాయంత్రం 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ఈ షోకోసం సదా రెట్రోలుక్ లో మెరిసింది. ఇక డిఫరెంట్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. 
 

లేటెస్ట్ పిక్స్ లో సదా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. కొంటెగా ఫొటోలకు ఫోజులిచ్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. పెదవులను కొరుతూ, ఓరగా చూస్తూ.. మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు పోగొట్టింది. 
 

ఇదిలా ఉంటే.. సదా సినిమాలకు దూరమైన ఐదేళ్లు గడిచాయి. ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో ‘హలో వరల్డ్’ సిరీస్ లో మెరిసింది. ఇక వెండితెరపై ఎప్పుడూ మెరుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 
 

Latest Videos

click me!