ట్రెండీ వేర్ లో తెలుగు బ్యూటీ మత్తెక్కించే లుక్.. టాప్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్

First Published | Jul 4, 2023, 12:51 PM IST

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) లేటెస్ట్ లుక్ తో మతులు పోగొట్టింది. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై వీలైనంత వరకు అందాల విందు చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడలేదు. ఇప్పటికీ సాలిడ్ బ్రేక్ కోసం చూస్తోంది.
 

అయితే, ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు తెలుగులో నాలుగు చిత్రాల్లోనే నటించింది. విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘గమనం’ వంటి చిత్రాలతో అలరించింది. ఇందులో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాస్తా హిట్ సినిమాగా నిలిచింది. 
 


మరోవైపు తెలుగు హీరోయిన్లు అవకాశాల కోసం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రియాంక జవాల్కర్ కూడా అవే సవాళ్లను చూస్తోంది. వచ్చిన అవకాశాలకు మాత్రం కాదనకుండా ఓకే చెబుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
 

అనిల్ రావిపూడి - బాలకృష్ణ కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’లో నటిస్తోంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో మాత్రమే మెరియనుంది. ఈ పాత్రతోనైనా కెరీర్ మలుపు తిరుగుతుందా చూడాలి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 

ఇదిలా ఉంటే.. ప్రియాంక జవాల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టి హాట్ టాపిక్ గ్గా మారుతుంటారు. ఆ మధ్యలో క్రికెట్ వెంకటేశ్ అయ్యర్ తో డేటింగ్ రూమర్లను కూడా ఎదుర్కొంది. 

మరోవైపు గ్లామర్ ఫొటోషూట్లతోనూ రచ్చ చేస్తోంది. తాజాగా టైట్ ఫిట్ లో అందాల విందు చేసింది. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే ఫోజులు, నిషా కళ్లతో సూటిగా చూస్తూ కుర్ర గుండెల్ని పేల్చేసింది. కుర్ర భామ స్టన్నింగ్ ఫోజులకు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!