నెట్టింట మంటలు పుట్టించి.. పద్ధతిగా మెరిసిన మృణాల్ ఠాకూర్.. సీతామహాలక్ష్మి లుక్ అదిరిపోయిందిగా

First Published | Jul 1, 2023, 5:22 PM IST

‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. లేటెస్ట్ ఫొటోల్లో సీతామహాలక్ష్మి హృదయాలను కొల్లగొట్టింది.
 

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ‘సీతారామం’తో పలకరించిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. 
 

బ్యూటీఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మృణాల్ వెంటనే తనలోని గ్లామర్ కోణాన్ని కూడా బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరుస ఫొటోషూట్లతో అందాల విందు చేసింది.
 


గ్లామర్ మెరుపులతో నెటిజన్ల మతులు పోగొట్టింది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ బాంబ్ లా పేలుతూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ రీసెంట్ గా ఓటీటీకి వచ్చిన పాపులర్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’తో మరోసారి సెన్సేషన్ గా మారింది. 

నెట్ ఫ్లిక్స్ లో జూన్ 9 నుంచి Lust Stories 2 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మృణాల్ బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది. బెడ్ పై మంటలు పుట్టింది. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. దీంతో ఇంటర్నెట్ హీటెక్కిపోయింది.
 

సిరీస్ రిలీజ్ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ’లస్ట్’పైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎవరూ ఊహించని విధంగా మృణాల్ కెరీర్ లో ముందుకు సాగుతూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతోంది.
 

ఇదిలా ఉంటే.. ఖతర్నాక్ ఫొటోషూట్లతోనూ మృణాల్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు గ్లామర్ ఫొటోషూట్లతో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో అట్రాక్ట్ చేసింది. 
 

తాజాగా మృణాల్ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. గజ్రా మరియు కుర్తా టైమ్ లోని ట్రెడిషన్ లుక్ గల డ్రెస్ లో మెరిసింది. పద్ధతిగా మెరిసి క్యూట్ ఫొజులతో ఆకట్టుకుంది. అన్ని యాంగిల్లో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. చిరునవ్వు, మత్తు చూపులతో మైమరిపించింది. 
 

కెరీర్ విషయానికొస్తే.. మృణాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో నాని సరసన Nani30లో నటిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన VD13తోనూ అలరించనుంది. మరిన్ని ఆఫర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హిందీలో ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’, ‘ఆంఖ్ మిచోలీ’ వంటి సినిమాలు చేస్తోంది. 
 

Latest Videos

click me!