అయితే ఇందులో మరో సర్‌ప్రైజ్ ఉంది. శివాత్మిక అక్క, హీరోయిన్ శివాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అక్కకి క్రేజీగా విషెస్ చెప్పింది శివాత్మిక. ఆమెతో ఉన్న పలు ఫోటోలు పంచుకుంటూ పోస్ట్ చేసింది. `జన్మదిన శుభాకాంక్షలు అక్కాజీ, మీ ఫన్నీ జోకులు, బాధాకరమైన గందరగోళ ఫ్యాషన్ ఎంపికలతో నన్ను చంపడం కొనసాగించండి. నువ్వు నా జీవితాన్ని చక్కగా మార్చావు, మంచి రోజు, 25నిమిషాల్లో కలుద్దాం, నిన్ను ప్రేమిస్తున్నాను` అంటూ పేర్కొంది శివాత్మిక.