చీరకట్టులో మెరిసిపోతున్న ‘జైలర్’ కోడలు.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న మిర్నా మీనన్

First Published | Sep 23, 2023, 2:31 PM IST

‘జైలర్’ నటి మిర్నా మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ కనిపిస్తున్నారు. తన గురించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చారు. 
 

తమిళ చిత్రాలతో మిర్నా మీనన్ (MIrna Menon) నటిగా కెరీర్ ను ప్రారంభించింది. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ వచ్చింది. తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అవకాశాలు దక్కడం విశేషం. ప్రస్తుతం తమిళంలో మిర్నా సందడి చేస్తోంది.
 

ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో సెకండ్ హీరోయిన్ గా నటించిన మిర్నామీనన్ కు టాలీవుడ్ లో తొలిచిత్రమిదే. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ మూవీలో నటించి మెప్పించింది. ఈ రెండు చిత్రాలతో ఆమెకు పెద్దగా క్రేజ్ దక్కలేదనే చెప్పాలి. 
 


కానీ కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన ‘జైలర్’ చిత్రంతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ‘జైలర్’ కోడలి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ కూడా భారీ సక్సెస్ ను అందుకోవడంతో పాటు మిర్నాకు ప్రత్యేక గుర్తింపును అందించింది.

దీంతో టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు ఖాయమంటున్నారు. పైగా మిర్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఈసారి చీరకట్టులో మెరిస మంత్రముగ్ధులను చేసింది. శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్న మిర్నా.. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మత్తు ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

మిర్నా నెట్టింట చేస్తున్న రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమెకు తెలుగులో మంచి రోల్ పడితే ఇక్కడ కొన్నాళ్లు ఆమె హవా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘బర్త్ మార్క్’ అనే చిత్రంలో నటిస్తోంది.  గతేడాది ‘అనంతం’ అనే వెబ్ సిరీస్ లోనూ మెరిసింది.
 

Latest Videos

click me!