హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్.. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.