చిరంజీవి షాకింగ్ నిర్ణయం, అందుకే అన్ని కార్యక్రమాలకు రామ్ చరణ్ వెళ్తున్నారా..? క్రేజీ రూమర్..?

First Published | Sep 23, 2023, 12:22 PM IST

కొంత కాలం షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయింకున్నారట మెగాస్టార్ చిరంజీవి. అసలు బయటకు రావడమే ఆయన తగ్గించుకున్నారు. 

Tollywood Super Star Chiranjeevi

గెలుపోటములకు సబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి. కాని ఆయన రీ ఎంట్రీ తరువాత చేసిన సినిమాల్లో సక్సెస్ అయినవి ఒకటి రెండు కంటే ఎక్కవలేవు. వరుసగా ప్లాప్ సినిమాలతో బాగా డిస్సపాయింట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య రిలీఫ్ ఇచ్చింది అనుకుంటే..  రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ కూడా గట్టి దెబ్బ కొట్టడంతో చిరు ఆలోచనలో పడ్డారు. 

ఇక నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్ ను ఆయన బర్త్ డే సందర్భంగా అందించారు చిరు. బింబిసార దర్శకుడు విశిష్టతో సినిమా ను కన్ ఫార్మ్ చేశాడు చిరు.. మరోవైపు తన పెద్ద కూతురు సుస్మిత కొనిదెల నిర్మాతగా..  కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో సినిమా చేయాల్సి ఉండగా.. అది అటకెక్కినట్టే అంటున్నారు. వశిష్టతో సినిమా మాత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. 


చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ బ్రో డాడీ రీమేక్ కావడంతో రీమేక్ ల విషయంలో నెగిటివ్ కామెంట్లు వస్తుండటంతో చిరంజీవి వెనక్కు తగ్గారని తెలుస్తోంది.మరోవిపు నవంబర్ నెల మొదలయ్యే వరకు చిరంజీవి షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఈరెండు మూడు నెలలు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. 
 

 కొంతకాలం క్రితం చిరంజీవికి మోకాలి సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కర్ర సాయంతో నడుస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ మూవీ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. చిరంజీవి పూర్తిగా కోలుకున్న తర్వాతే  ఆ షూటింగ్ కు వెళ్తారట చిరు. 

మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కాలికి సర్జరీ అవ్వడంతో.. ఇండస్ట్రీ కార్యక్రమాలకు కూడా రామ్ చరణ్ ను పంపిస్తున్నారట. అంతే కాదు చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ టాలీవుడ్ కు మెగా పవర్ స్టార్ ను బాగా దగ్గర చేయాలని చూస్తున్నాడట. అందుకే ఈమధ్య ఏ కార్యక్రమం జరిగినా.. మెగాస్టార్ బదులుగా రామ్ చరణ్ వెళ్తున్నాడు. 

చిరు అత్యవసరం అయితేనే బయట కార్యక్రమాలకు కదులుతున్నారు. . దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. నెక్ట్స్ ఆ స్థానానికి ఇప్పటి నుంచే రామ్ చరణ్ ను అలవాటు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సెలబ్రిటీల పెళ్లిళ్లలో కూడా రామ్ చరణ్ సతీసమేతంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ శత జయంతి వేడుకలకు కూడా రామ్ చరణ్ నే వెళ్లారు. అందరితో మమేకం అవుతూ.. కలిసిపోయి కనిపిస్తున్నాడు చరణ్. దాంతో ఫ్యూచర్ లో ఇండస్ట్రీ కి తలలో నాలుకలా చరణ్ మారబోతున్నట్టు కనిపిస్తుంది. 
 

Latest Videos

click me!