చీరకట్టులో కట్టిపడేస్తున్న ‘రావణసుర’ బ్యూటీ.. బ్లాక్ శారీలో మేఘా ఆకాష్ బ్యూటీఫుల్ లుక్..

First Published | Jun 19, 2023, 3:20 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash)  మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. రీసెంట్ గా ‘రావణసుర’తో అలరించింది.
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ తన కేరీర్ ను తెలుగు చిత్రాలతోనే ప్రారంభించింది. నితిన్ సరసన ‘లై’, ’ఛల్ మోహన రంగ’ వంటి చిత్రాల్లో నటించింది. మేఘాకు ఇవి తొలి రెండు చిత్రాలు. ఈ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 
 

తెలుగులో పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో రూట్ కోలీవుడ్ కు మార్చింది.  అక్కడా వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ పెద్ద హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రేక్షకుల్లో మాత్రం తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. 


ఈ ముద్దుగుమ్మ అటు హిందీలోనూ అవకాశాలను సొంతం చేసుకుంది. కొన్ని చిత్రాల్లో నటించి మళ్లీ దక్షిణాది చిత్రాలపైనే ఫొకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ ను ఫినిష్ చేస్తూ వస్తోంది.
 

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన అభిమానులు, నెటిజ్లను ఎప్పటికప్పుడు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షోకు కాస్తా దూరంగానే ఉండే ఈ భామ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా బ్లాక్ శారీలో మెరిసింది. ఎప్పుడు మోడ్రన్ డ్రస్సుల్లో దర్శనమిచ్చే  మేఘా ఆకాష్ తాజాగా మాత్రం చీరకట్టులో కట్టిపడేసింది. శారీలో వెలిగిపోతోంది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నమేఘా తన స్మైల్ తో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తమ ఉనికి చాటుకోవాలంటే నెట్టిళ్లే మంచి ఆయుధంగా మారింది. దీంతో ఈ బ్యూటీ కూడా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. రోజురోజుకు తన ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉంది. తదుపరి మేఘా ‘Boo’ అనే చిత్రంలో అలరించబోతోంది. 
 

Latest Videos

click me!