రెడ్ డ్రెస్ లో ఇంత స్టన్నింగ్ గా ఉందేంట్రా బాబూ.. మతిపోగొడుతున్న మీనాక్షి చౌదరి.. పిక్స్

First Published | Jul 24, 2023, 2:36 PM IST

నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. ‘హిట్2’తో అందిన సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. మరో సాలిడ్ హిట్ పడితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.
 

హర్యానాలో పుట్టి పెరిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది. తన పాత్రకు ప్రాధ్యానత ఉండేలా చూసుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. దీంతో మీనాక్షికి ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయి. 
 

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో మీనాక్షి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నటనపరంగా మంచి మార్కులు దక్కించుకుంది. ఆ తర్వాత ‘ఖిలాడీ’లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన HIT2లో యంగ్ హీరో అడివి శేషు సరసన నటించి మెప్పించింది. అద్బుతమైన పెర్ఫామెన్స్ తో అలరించింది. ఈ చిత్రం సక్సెస్ అవ్వడంతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ దక్కింది.
 


ప్రస్తుతం లీడ్ యాక్టర్, స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు దక్కించుకుంటోంది. ఇప్పటికే మాస్ కా దాస్, యంగ్ హీరో విశ్వక్ సేన్ 10వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కూడా నటించబోతోంది. ‘గుంటూరు కారం’లో మరో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ చోటు దక్కించుకుంది.
 

వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఒక్కసాలిడ్ హిట్ తాకినా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు తగ్గట్టుగా మీనాక్షి ప్లాన్ చేసుకుంటోంది. మంచి కథలను ఎంచుకోవడం, పెర్ఫామెన్స్ లో ది బెస్ట్ అందించడంతో వీలైనంత వరకు కృషి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ తప్పనిసరిగా మారింది. ఇందుకోసం మీనాక్షి సోషల్ మీడియాలోనూ నిత్యం కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్  అందిస్తూనే.. మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మేకప్ రూమ్ లో రెడీ అవుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. రెడ్ టైట్ ఫిట్ లో మెరిసిపోయింది. బిగుతైన ఆకర్షణీయమైన దుస్తుల్లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. స్లీవ్ అండ్ స్ట్రిప్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో మతులుపోగొట్టింది. అలాగే బ్యాక్ నుంచి ఫొటోకు ఫోజు ఇచ్చి కట్టిపడేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఎంత బ్యూటీఫుల్ గా ఉన్నావో అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 
 

Latest Videos

click me!