రామ్‌ చరణ్‌ వేసుకున్న టీషర్ట్ ధర ఎంతో తెలుసా? బన్నీ, మహేష్‌, ఎన్టీఆర్‌ లు కూడా ఈ రేంజ్‌లో వేయరు?

First Published | Dec 31, 2024, 11:06 PM IST

రామ్‌ చరణ్‌ తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ 4 షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన టీషర్ట్ ధర షాకిస్తుంది. 
 

రామ్‌ చరణ్‌ మొదటిసారి టీవీ షోలో పాల్గొంటున్నారు. ఆయన పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలు ఇచ్చారు. టీవీ ఛానెల్స్ లో పాల్గొన్నారు. కానీ టాక్‌ షోలో పాల్గొనడం ఇదే మొదటి సారి కావచ్చు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోలో పాల్గొన్నారు రామ్‌ చరణ్‌. మంగళవారమే ఆయనపై షూట్‌ చేశారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. అంటే కరెక్ట్ గా `గేమ్‌ ఛేంజర్‌` రిలీజ్‌ రోజే టెలికాస్ట్ కాబోతుంది. 
 

రామ్‌ చరణ్‌ బాలయ్య షోకి వస్తున్నాడంటే అంతా ఆసక్తికరంగా మారింది. ఏం మాట్లాడబోతున్నారు? ఏం చెప్పబోతున్నారనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. తన ఫ్రెండ్‌, `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ ఎన్టీఆర్‌ గురించి ఏం మాట్లాడతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ గురించి ఏం చెప్పబోతున్నాడు? అనేది, దీంతోపాటు అల్లు అర్జున్‌ వివాదంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. 

read More: కృష్ణ సినిమాలో విలన్‌గా చేసి, తర్వాత సూపర్‌ స్టార్‌గా ఎదిగి తనకే పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?


ఈ క్రమంలో ఈ షోలో రెండు క్రేజీ విషయాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. లైవ్‌లో ప్రభాస్‌కి ఫోన్‌ చేశాడట బాలయ్య. గతంలో ప్రభాస్‌ వచ్చినప్పుడు చరణ్‌కి ఫోన్‌ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌ చరణ్‌ గురించి ఏం చెప్పాడనేది ఆసక్తికరం.

ఇంకోవైపు మహేష్‌ గురించి చరణ్‌ స్పందించాడట. ఆయనతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలని ఉందని తెలిపినట్టు సమాచారం. `గేమ్‌ ఛేంజర్‌` సినిమా గురించి పలు విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఇందులో శర్వానంద్‌ కూడా పాల్గొనడం విశేషం. 

ఇదిలా ఉంటే ఈ టాక్‌ షోకి రామ్‌ చరణ్‌ లుక్‌ స్పెషల్‌గా నిలుస్తుంది. ఆయన ధరించిన డ్రెస్‌ పై అందరి దృష్టి పడుతుంది. ఆయన వేసుకున్న టీషర్ట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇందులో చరణ్‌.. బోన్స్ హూడీ ధరించారు చరణ్‌. అమిరి కంపెనీకి చెందిన లాంగ్‌స్లీవ్స్ కలిగిన టీషర్ట్ ఇది. దీని ధర షాకిస్తుంది.

అక్షరాల రూ.1,35,722 ఉంటుందట. మన మార్కెట్‌లో ఇది 88వేలకు దొరుకుతుందని తెలుస్తుంది. ఇలాంటి కాస్ట్లీ టీషర్ట్ ని బన్నీ, మహేష్‌, తారక్‌ లాంటి హీరోలు కూడా ధరించరనే టాక్‌ వినిపిస్తుంది. ఏదేమైనా ఈ టాక్‌ షోలో చరణ్‌ పాల్గొనడమే కాదు, ఆయన ధరించిన టీ షర్ట్ కూడా వార్తల్లో నిలవడం విశేషం. 

also read: మహేష్‌ తో రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్‌.. మనసులో కోరిక చెప్పిన హీరో, కొత్త ఏడాది ఫ్యాన్స్ పండగ చేసుకునే మాట
 

రామ్‌ చరణ్‌ ఆరేళ్లగ్యాప్‌ తర్వాత సోలో హీరోగా ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. `వినయ విధేయ రామ` వంటి డిజాస్టర్‌ తర్వాత ఆయన నుంచి వస్తోన్న సినిమా ఇది. మధ్యలో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `ఆచార్య` వంటి మల్టీస్టారర్‌ మూవీస్‌ చేశారు చరణ్‌. ఇక `గేమ్‌ ఛేంజర్‌` మూవీని పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర.

దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అంజలి, ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 10న ఈ మూవీ పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

read More: ఫ్యాన్స్ కి ప్రభాస్‌ న్యూ ఇయర్‌ సందేశం, మనల్ని ప్రేమించే మనుషులున్నారంటూ ఎమోషనల్‌ వర్డ్స్
 

Latest Videos

click me!