ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి షోకి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మళ్లీ కలిశామని, అయితే ఆమె పెద్దగా గుర్తుపట్టలేదని, తాను కామ్‌గా ఉండేదని తెలిపింది. ఇక రోజాకి తమిళంలో చేసిన మూవీ బ్రేక్ ఇచ్చిందని, దీంతో ఇక స్టార్ అయిపోయిందని, వరుసగా ఎన్నో సినిమాలు చేసిందన్నారు మాధవి రెడ్డి. ఇప్పుడు రాజకీయాల్లో రాణించడంపై చెబుతూ, ఆమె చాలా ఇంటలిజెంట్ అని, మాట తీరు ఉంటుంది, ధైర్యం ఉందని అందుకే రాణించిందన్నారు. ఆ దైర్యం లేకపోతే రాజకీయాల్లో రాణించడం కష్టమని, దానితో ఇప్పుడు మంత్రిగా ఎదిగిందని ప్రశంసలు కురిపించింది.