'రాత్రి అనిపిస్తుంది.. తెల్లారేసరికి మర్చిపోతా..' ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్ మాధవీలత..

Published : Jan 04, 2026, 04:40 PM IST

Actress Madhavi Latha: నటి మాధవీలత హిందూ ధర్మం, మహిళల పట్ల గౌరవం లాంటి సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆమె ఏమన్నారో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. 

PREV
15
కీలక విషయాలు వెల్లడి..

టాలీవుడ్ నటి మాధవీలత ఈ మధ్య ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నారు. ఇటీవల నా అన్వేషణ, శివాజీ అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన ఆమె.. హిందూ దేవుళ్లపైనా కామెంట్స్ చేశారు. 2008లో నచ్చావులే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. ప్రస్తుతం సామాజిక సేవలో ఉన్నారని చెప్పొచ్చు.

25
ఓ వీడియో వైరల్..

తాను ఇటీవల సాయిబాబాపై చేసిన ఓ వీడియో వైరల్ కావడం, అది పోలీస్ ఫిర్యాదుకు దారి తీయడం జరిగిందని నటి మాధవీలత తెలిపింది. తాను మాట్లాడింది సరైందేనని, కాబట్టి భయం లేదని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

35
నా అన్వేషణ అంశం..

ఇన్‌ఫ్ల్యూయన్సర్ అన్వేష్ హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగింది. దీనిపై కేసు కూడా నమోదైంది. గత నెలలో తాను కూడా అన్వేష్‌పై ఒక వీడియో చేశానని మాధవీలత తెలిపింది. అటు హీరో శివాజీ వ్యాఖ్యలపై కూడా స్పందించిందామె. ఈ సంఘటనపై తాను ఒక రోజు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నానని, వెంటనే జనాలు స్పందించి ఇలా ప్రశ్నిచారని పేర్కొంది.

45
రాజకీయ ప్రవేశం ఇలా..

తాను 2018లో రాజకీయాలలో చేరానని.. 2019లో పోటీ చేశానని.. 2020-21లో చాలా చురుకుగా పాల్గొన్నానని మాధవీలత తెలిపింది. తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో ఇంకా తనకే తెలియదని.. తాను చాణక్యుడిలా పథకాలు వేయలేనని చెప్పింది మాధవీలత. అటు సినిమాల్లో అలా చేస్తేనే ఆఫర్లు వస్తాయని మాధవీలత తెలిపింది.

55
పెళ్లి ఎప్పుడు..

పెళ్లి ఎప్పుడూ అనే ప్రశ్నకు మాధవీలత ఇలా సమాధానమిచ్చారు.. ఎప్పుడు జరుగుతుందో తనకే తెలియదన్నారు. తాను చాలా జెన్యూన్‌గా ఉండాలని, మహిళలకు చాలా గౌరవం ఇవ్వాలని ఆశిస్తానని తెలిపింది. అలాగే పరిశ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త పడాలి అని అనిపించిందా అనే ప్రశ్నకు.. రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుందని, తెల్లారేక మర్చిపోతానని సరదాగా సమాధానమిచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories