అందంతో మత్తెక్కించడం బేబమ్మకే సాధ్యం.. కృతి శెట్టి మెరుపులకు మరో హ్యాట్రిక్ బ్యూటీ ఫిదా.. పిక్స్

First Published | Jun 12, 2023, 9:20 PM IST

హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)  సోషల్ మీడియాలో ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిస్తూ మంత్ర ముగ్దులను చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు మరో హ్యాట్రిక్ బ్యూటీ  ఫిదా అయ్యింది. 
 

టాలీవుడ్ లోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన కృతి శెట్టి ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. కేరీర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ వరుసగా మూడు చిత్రాలతో హిట్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. 
 

రీసెంట్ గా కృతిశెట్టి ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన రెండోసారి నటించిన బేబమ్మకు ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. దీంతో నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
 


దాంతో పాటు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు తన అభిమానులను ఖుషీ చేసేందుకు ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గానే కనిపిస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ డ్రెస్ లు ధరిస్తూ ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని పిక్స్ ను పంచుకుంది. 
 

తాజాగా కృతి శెట్టి పంచుకున్న ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. గోల్డ్ కలర్ లెహంగా, వోణీలో బేబమ్మ బంగారంలా మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తులు బేబమ్మకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే తన క్యూట్ స్మైల్ తోనూ కట్టిపడేసింది. 
 

బేబమ్మ పంచుకున్న ఫొటోలను టాలీవుడ్ మరో హ్యాట్రిక్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా లైక్ చేసింది. మరోవైపు కృతి అభిమానులు కూడా లేటెస్ట్ ఫొటోలకు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

కేరీర్ విషయానికొస్తే బేబమ్మ ప్రస్తుతం డేంజర్ జోన్ లోనే ఉందని అంటున్నారు. వరుసగా మూడు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. కస్టడీ కాస్తా అలరించినా పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు. దీంతో ఈ బ్యూటీకి మరో హిట్ కావాల్సిందేనని అర్థం అవుతుంది. 
 

ఈక్రమంలో మరో న్యూస్ కూడా వినిపిస్తోంది. కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటోందని, ఇప్పటికే దళపతి విజయ్ సినిమాలో ఎంపికైందని టాక్. మరోవైపు విశాల్ సరసన కూడా నటించబోతోందని అంటున్నారు. సూర్య సరసన నటించాల్సిన ఈ ముద్దుకు కొద్దిలో ఛాన్స్  మిస్సైంది. ప్రస్తుతం కొద్దిరోజులు తమిళంలోనే సందడి చేయబోతుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!