బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న కేతికా శర్మ.. ‘రొమాంటిక్’ బ్యూటీ టెంప్టింగ్ పోజులకు ఇంటర్నెట్ షేక్

First Published | May 26, 2023, 5:50 PM IST

తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) . ప్రస్తుతం ఆ చిత్రంపైన ఈ ముద్దుగుమ్మ భారీ అంచనాలు పెట్టుకుంది. 

‘రొమాంటిక్’ సినిమాతో కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన నటించింది.
 

ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాలు కేతికకు పెద్దగా నక్సెస్ ను అందించలేకపోయాయి. అయినా ఈ బ్యూటీ తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో అవకాశాలూ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.


గ్లామర్ పరంగా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నటన పరంగానూ ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు దక్కించుకుంటే.. స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోవడం ఖాయమంటున్నారు. ఈమేరకు కేతికా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
 

ఈ సందర్భంగా కేతిక సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. అదేవిధంగా స్టన్నింగ్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 

తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. బ్యాక్ లెస్ అందాలతో మతులు పోగొట్టింది.  బ్రా లాంటి టాప్ లో, ఫ్రంటూ బ్యాక్ పరువాలను ప్రదర్శిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు మత్తు కళ్లతో గుచ్చే చూపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనను ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్లతో నెట్టింట ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక కేతిక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న Bro చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది.
 

Latest Videos

click me!