అయినవాళ్లే అన్యాయం చేశారు, ఇంట్లోంచి గెంటేశారు, వనిత విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.

Published : May 26, 2023, 04:34 PM IST

చాలా కాలం తరువాత మళ్లీ పెళ్లి సినిమాతో మరోసారి తెలుగు వెండితెరపై కనిపించింది వనితా విజయ్ కుమార్. తమిళనాట సంచలనాల నటిగా పేరున్న ఈ స్టార్ బ్యూటీ.. తాజాగా తన కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

PREV
16
అయినవాళ్లే అన్యాయం చేశారు, ఇంట్లోంచి గెంటేశారు, వనిత విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.

ఎప్పుడో ఇరవైనాలుగేళ్ల క్రితం కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వనితా విజయ్ కుమార్. సౌత్ సీనియర్ నటుడు విజయ్ కుమార్.. మంజుల పెద్ద కూతురు వనిత. కెరీర్‌ బిగెనింగ్‌లో వరుస సినిమాలు చేసి.. పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయ్యింది.  బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా గడిపిన వనితా.. ఆ తర్వాత  సినిమాలకు దూరమైంది. 

26

ఇక తమిళనాట సంచలాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వనిత విజయ్ కుమార్. ముఖ్యంగా మూడు నాలుగు పెళ్ళిళ్ళతో వనిత హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ప్రతీ పెళ్ళి పెటాకులు కావడం.. కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా వనితాకు పేరు ఉంది. తమిళ బిగ్ బాస్ లో కూడా ఆమె సందడి చేసింది. వనితకు తన తండ్రితో.. ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయి, దాంతో కుటుంబానికి దూరంగా బ్రతుకుతోంది. 

36

కాగా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి సినిమాతో టాలీవుడ్  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది వనిత విజయ్ కుమార్.  నరేష్‌-పవిత్రలోకేష్‌ లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ సినిమాకు ఎమ్‌.ఎస్‌ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా వనితా విజయ్‌ కుమార్‌ ఈ సినిమా ప్రమోషన్‌లో తన పర్సనల్‌ విషయాలను పంచుకుంది. సంచలన కామెంట్స్ చేసింది. 

46

తన కుటుంబ సభ్యులే తనను వేరుగా చూశారని. తన తల్లికి తానంటే చాలా ఇష్టమంటోంది వనిత. ఒకానొక సమయంలో కుటుంబసభ్యులే బెదిరించారని అంటోంది.  తనను అకారణంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని వనితా విజయ్‌కుమార్‌  సంచలన ఆరోపణలు చేవారు. ఆస్తి విషయంలో వచ్చిన విభేదాలే దానికి కారణం అంటోంది వనిత విజయ్ కుమార్. 

56

ఇక  గతంలో కూడా  తాను తన ఇంట్లో  ఆస్తి తగాదాలను ఎదుర్కొన్నట్లు, అప్పుడు సొంత కుటుంబ సభ్యులే తనను  కాదని, ఇంట్లో నుంచి పంపించేశారని వనిత చెప్పుకొచ్చింది. అప్పుడు ఎక్కడికి వెళ్లాలలో అర్థం కాలేదని.. ఆ సమయంలో పిల్లలను తీసుకుని పొరుగు రాష్ట్రంలె తల దాచుకున్నానంటోంది. 

66

పక్కనే ఉన్న  కర్ణాటకకు పిల్లలతో సహా  వెళ్లిపోయి అక్కడే రెండేళ్ల పాటు ఉన్ననని చెప్పింది. ఆ టైమ్‌లో వాళ్ల నాన్నకు ఫోన్‌ చేస్తే తమిళనాడులో నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒక్క సారి వచ్చి చూడు అంటూ ఛాలెంజ్‌ చేశారని తెలిపింది. కానీ, ఇప్పుడు తమిళనాడులు తనను అందరూ ఇంటి బిడ్డలా భావిస్తున్నారని చెప్పుకొచ్చింది వనిత విజయ్ కుమార్. 
 

click me!

Recommended Stories