Anasuya Bharadwaj: తల్లైన అనసూయ... బేబీ బంప్ తో షాకింగ్ లుక్ వైరల్!

Published : Jan 31, 2023, 11:49 AM IST

అనసూయ మరోసారి తల్లి అయ్యారు. ఆమె షాకింగ్ లుక్ వైరల్ అవుతుంది. అనసూయ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.   

PREV
17
Anasuya Bharadwaj: తల్లైన అనసూయ... బేబీ బంప్ తో షాకింగ్ లుక్ వైరల్!
Anasuya Bharadwaj

స్టార్ యాంకర్ అనసూయ గర్భవతిగా కనిపించి షాక్ ఇచ్చారు. అయితే నిజంగా కాదులెండి. ఆమె లేటెస్ట్ మూవీలో అనసూయ ప్రెగ్నెంట్ రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ ఆమె రివీల్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. 
 
27
Anasuya Bharadwaj

దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇది మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. కోవిడ్ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ కి వాయిదా పడింది. గత ఏడాది షూటింగ్ తిరిగి స్టార్ట్ అయ్యింది. అయినప్పటికీ ఎందుకో ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. 
 
37
Anasuya Bharadwaj

రంగమార్తాండ మూవీలో శివాత్మిక రాజశేఖర్, అనసూయ, బ్రహ్మానందం సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ పాత్రపై ఓ న్యూస్ చాలా కాలంగా చక్కర్లు కొడుతుంది. ఆమె సాహసోపేతమైన దేవదాసిగా కనిపిస్తారనే కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లకు సంబంధం లేకుండా అనసూయ లుక్ ఉంది. 
 
47
Anasuya Bharadwaj

అనసూయ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రంగమార్తాండ మూవీ వర్కింగ్ స్టిల్ షేర్ చేశారు. ఆ ఫోటోలో శివాత్మిక పెళ్లికూతురిగా ముస్తాబై ఉంది. పక్కనే ఆమె తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఉన్నారు. అదే ఫొటోలో అనసూయ కూడా ఉన్నారు. ఆమె బేబీ బంప్ తో కనిపించారు. కాబట్టి రంగమార్తాండలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. 

57

ఈ క్రమంలో రంగమార్తాండ మూవీలో అనసూయ పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. సిల్వర్ స్క్రీన్ పై అనసూయ ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. విశేషం ఏమిటంటే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఆమె తలుపు తడుతున్నాయి. పుష్ప, ఖిలాడి, దర్జా చిత్రాల్లో వరుసగా ఆమె నెగిటివ్ రోల్స్ చేశారు. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

67

ట్రైలర్ చూశాక అనసూయ మైఖేల్ లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా విలన్ గా కనిపించనున్నారు. కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. మొదట జబర్దస్త్ వదిలేసిన అనసూయ... మెల్లగా మిగతా షోస్ నుండి కూడా తప్పుకున్నారు. అనసూయ యాంకర్ గా ఒక్క ప్రోగ్రాం టెలికాస్ట్ కావడం లేదు. బుల్లితెర ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు. 

77

Read more Photos on
click me!

Recommended Stories