Ennenno Janmala Bandham: మాళవికను అవమానించిన భ్రమరాంబిక.. మాళవికకు బుద్ధి చెప్పిన యష్?

First Published Jan 31, 2023, 11:43 AM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 31వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో యష్ ట్రెడిషనల్ గా రెడీ అయి రావడంతో అది చూసి వేద సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు విన్నీ సూపర్ గా ఉన్నారు బ్రో అని పొగడగా వెంటనే ఖుషి అమ్మ డాడీ ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా అయితే మీ డాడీకి దిష్టి తీస్తావా ఏంటి అనడంతో ఖుషి, యష్ దగ్గరికి వెళ్లి మీకు ఎవరి దిష్టి తగలకూడదు డాడీ అనడంతో చూసి వేద సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వేద థ్యాంక్స్ అనగా ఎందుకు అనడంతో డ్రెస్ వేసుకొని వచ్చారు కదా అనగా హలో నేను మీకోసం వేసుకొని రాలేదు మా అత్తయ్య మామయ్య పండక్కి బట్టలు పెట్టారు వాళ్లకోసం వేసుకొని వచ్చాను అంటాడు. ఇది వాళ్ళ తరఫున థాంక్స్ అనడంతో నో థ్యాంక్స్ అని అంటాడు.
 

ఆ తర్వాత ఖుషి వచ్చి డాడీ మమ్మీ ముగ్గుల పోటీలో పోటీ చేయడం లేదంట అనడంతో మానేయమను ఎవరిని బెదిరిస్తుంది అని అంటాడు. పోతే మీ మమ్మీ 50 వేలు పోగొట్టుకుంటుంది అనగా, అంటే ఏంటి ఖుషి మీ డాడీ చేయి 50,000 కోసం నేను పోటీ చేయాలా అనడంతో కమాన్ వేద నువ్వు పోటీ చెయ్యి అనడంతో వెంటనే యష్ తను మొండిఘట్టం నేను అడిగితేనే కుదరదు అని చెప్పింది వదిలేయండి అని అంటాడు. అప్పుడు నో బ్రో అప్పుడు కాలేజీలో కూడా ఫస్ట్ ఇలాగే అని చెప్పింది తర్వాత నేను అడిగిన తర్వాత ఓకే అని చెప్పింది అంటాడు విన్నీ. అప్పుడు వేద కావాలనే యష్ ని చూసి అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు ఒకసారి చెపుతావా అని అనడంతో విన్నీ జరిగింది మొత్తం వివరిస్తుండగా అది చూసి యష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

 ఇంతలా బ్రతిమాలాడుతుంటే నేను ఎలా కాదంటాను విన్ని నేను ముగ్గుల పోటీలో పాల్గొంటాను అనడంతో యష్ కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు యష్ అక్కడినుంచి వెళ్తూ ఉండగా ఇంతలో వసంత్ రావడంతో వేద మీద ఉన్న కోపమంతా వసంత్ మీద చూపిస్తాడు. అంటే ఇదంతా జనసేన నాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మాళవిక ఒక చోట నిలబడి ఉండగా ఇంతలో భ్రమరాంబిక అక్కడికి వచ్చి ఏంటి బంగారం ఇక్కడ ఉన్నాను నువ్వు కూడా ముగ్గుల పోటీలో పాల్గొనవచ్చు కదా అనగా, ముగ్గులు వేయడం రాదు ఇంట్రెస్ట్ కూడా లేదు అనడంతో ఇంతవరకు ముగ్గులు వేయడం కాదు అలా ఆడదాన్ని చూడలేదు అది అసలు నా దృష్టిలో ఆడదే కాదు అనడంతో ఏంటి వదిన నువ్వు అమెరికాలో ఉన్నావ్ అప్డేట్ అవ్వాలి కదా అంటుంది మాళవిక.
 

 అప్పుడు మాళవిక భ్రమరాంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంతలో ఖుషి అక్కడకు వచ్చి పడిపోతూ ఉండగా బ్రమరాంబిక పట్టుకుంటుంది. చాలా క్యూట్ గా ఉన్నావు పాప మీ అమ్మ ఎవరు అనడంతో వేద వైపు చూపించడంతో మాళవిక షాక్ అవుతుంది. అప్పుడు వేద ఖుషిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉండగా అది చూసి మాళవిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఒక క్షణం ఆ పాప నీ కూతురే అనుకున్నాను బంగారం. నీ కూతురు కూడా అంత ఏజ్ ఉంటుంది కదా,అయినా నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. భర్త లేక పిల్లలు లేక ఒంటరిగా జీవితాన్ని బతుకుతున్నావు అని అంటుంది భ్రమరాంబిక. ఆ తర్వాత అందరూ కలిసి ముగ్గుల పోటీని ప్రారంభిస్తారు. అప్పుడు అందరూ కలిసి ముగ్గులు వేస్తూ ఉంటారు.

అప్పుడు వేద ముగ్గు వేస్తూ ఉండగా విన్నీ ఫోటోలు తీస్తూ ఉండడంతో అది చూసి యష్ కుళ్ళుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వేద ముఖానికి కలర్ అవ్వడంతో విన్నీ తుడుస్తుండగా అది చూసి యష్ మరింత కుళ్ళుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యష్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు కైలాష్ అభికి లేనిపోని టెన్షన్స్ అన్నీ పెడుతూ ఉంటాడు. కాసేపు నువ్వు మౌనంగా ఉంటావా అని సీరియస్ అవుతాడు అభి. మరొకవైపు యష్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో మాళవిక ఆఖరికి వచ్చి యశోదర్ నిన్ను చూస్తే జాలిపడాలో అర్థం కావడం లేదు అనగా నా గురించి నువ్వేం ఆలోచించకు అనడంతో ఎలా ఆలోచించకుండా ఉంటాను యశోదర్ ఎంతైనా నువ్వు నా మాజీ మొగుడివి కదా అని అంటుంది.
 

నీకు పెళ్ళాలు అచ్చురావడం లేదేమో అప్పట్లో నేను ఇప్పుడు వేద అని అంటుంది. ఎవడో విన్నీ అంతా వేద ఓల్డ్ ఫ్రెండ్ అంట నీ ముందే రాసుకు పూసుకు తిరుగుతున్నారు అని అంటుందిమాళవిక. చూడ్డానికి ఎంత చండాలంగా ఉందో తెలుసా అని అంటుంది. అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా వేద మీద నీ కుళ్లంతా వెళ్లగక్కావు కదా అని అంటాడు. నువ్వు మాట్లాడిన మాటలకు నీ చెంప పగలగొడదామని పిస్తుంది కానీ నాకు ఆ అవసరం లేదు అని అంటాడు యష్. ఎప్పుడు వేదని చూసి కుళ్ళుకుంటూ ఉంటావు అసలు నీకు వేద ఏం అన్యాయం చేసింది. నీకు వేదకి చాలా తేడా ఉంది అని అంటాడు యష్. ఇదే నీలో నాకు నచ్చడం లేదు ఆ వేద నెత్తిన పెట్టుకుంటున్నావు అనడంతో నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అని అంటాడు. వేద పేరు ఎత్తడానికి వేద కాలి గోటికి కూడా సరిపోవు అనడంతో యశోదర్ అనడంతో ఏయ్ ఆపు అనే వార్నింగ్ ఇస్తాడు యష్. తర్వాత యష్ ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్లి వేద వైపు చూస్తూ ఉంటాడు.

click me!