ఇప్పుడైతే నటి కస్తూరి బుల్లితెరపై నటిస్తోంది కానీ ఒకప్పుడు ఆమె స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. భారతీయుడు, అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించి మెప్పించడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు.
ఆమె నటిస్తున్న గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దీనితో ఆమె తెలుగువారందరికీ గృహాలక్ష్మిగా మారిపోయారు. దాదాపు ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి అందమైన ఇన్స్టా రీల్స్, హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.
కస్తూరి ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడేందుకు వెనకడుగు వేయదు. వివాదాస్పద అంశాలపై కూడా ఆమె స్టాండ్ తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. అనసూయని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నప్పుడు.. అలా చేయడం తప్పు అంటూ కస్తూరి వ్యాఖ్యలు చేసింది. అనసూయకి మద్దతు తెలిపింది.
తాజాగా ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్ ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాఘవేంద్ర రావు, శంకర్ లాంటి దర్శకులతో వర్క్ చేయడం గురించి కస్తూరి ఓపెన్ అయింది. వారితో కలసి పనిచేయడం ఎంత అదృష్టమో నాకు ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. అప్పుడు నాది చిన్న వయసు. కాబట్టి ఏదో సరదాగా చేసేశా అని కస్తూరి తెలిపింది.
భారతీయుడు చిత్రంలో మొదట నన్ను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారు. సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని డైరెక్టర్ కి బికినీ ఫోటోలు కూడా పంపా. అయితే అదే సమయంలో రంగీలా చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఊర్మిళ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దీనితో అటెన్షన్ ఆమె వైపు వెళ్ళింది. చివరికి ఊర్మిళ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చారు. అంటే భారతీయుడికి కుమార్తెగా. ఏంటి సర్ ఇలా చేశారు అని అడిగా. సినిమాలో ఇదే కీలకమైన పాత్ర అని చెప్పడంతో ఒప్పుకున్నట్లు కస్తూరి పేర్కొంది. ఇక అన్నమయ్య చిత్రం గురించి చెబుతూ.. నాగార్జున గారు తొలి రోజు నాకు షాక్ హ్యాండ్ ఇవ్వడంతో ఇంటికి వెళ్లెవరకూ హ్యాండ్ వాష్ చేసుకోలేదు అని అన్నారు.
ఇక ఆ చిత్రానికి నాకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు. పక్కనే రమ్యకృష్ణ కూడా ఉన్నారు. ఆమె పక్కన ఏ హీరోయిన్ ఉన్నా ఆనరు.. పక్క క్యారెక్టర్ ని చంపేసేంతగా రమ్యకృష్ణ పెర్ఫామెన్స్ ఉంటుంది. అలాంటిది నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయంటే మామూలు విషయం కాదు అని కస్తూరి గుర్తుచేసుకుని సంబరపడ్డారు.
Anasuya Bharadwaj kasturi
నేను ఎప్పుడూ గ్లామర్ గానే ఉండాలనుకుంటా. కానీ గృహలక్ష్మి సీరియల్ వల్ల తెలుగులో రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో వ్యక్తిగా మారిపోయా. నేను సరదాగా పబ్ కి వెళుతుంటా. వాటర్ మిలన్ లాంటి జ్యూస్ మాత్రమే తాగుతా. ఒకసారి పబ్ లో వాష్ రూమ్ కి వెళితే.. అక్కడ క్లీనింగ్ చేసే మహిళలు నన్ను చుట్టుముట్టేశారు. గృహలక్ష్మి తులసి అంటూ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వాళ్ళు చూపించిన ఆప్యాయత అంతా ఇంతా కాదు అని కస్తూరి తెలిపింది.