నాని, నితిన్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాలను అక్కడ కొనేవారే లేరట.. ఇదెక్కడి దారుణం!

Aithagoni Raju | Published : Nov 13, 2023 12:04 PM
Google News Follow Us

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు దుమ్ములేపుతుంటే, యంగ్‌ హీరోలు మాత్రం డీలా పడుతున్నాయి. వారి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందడం లేదు. దీంతో వారి సినిమాల బిజినెస్‌పై ప్రభావం పడుతుంది. 
 

16
నాని, నితిన్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాలను అక్కడ కొనేవారే లేరట.. ఇదెక్కడి దారుణం!
tollywood heroes

టాలీవుడ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాలు బోల్తా కొట్టగా, సెకండ్‌ రేంజ్‌ హీరోలు సైలెంట్‌గా హిట్లుకొట్టి తమ సత్తానినిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు స్టార్‌ హీరోల హవా సాగుతుంది. పెద్ద హీరోలు పాన్‌ ఇండియా మూవీస్‌తో దుమ్మురేపుతున్నారు. కానీ టయర్‌ 2 హీరోలు మాత్రం హిట్‌ కోసం పిల్లిగంతులేస్తున్నారు. నానా తంటాలు పడుతున్నారు. ఎంత విభిన్నంగా చేసినా సక్సెస్‌ పడటం లేదు. ఇది వారి కొత్త సినిమాల బిజినెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 

26

నాని, నితిన్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన `హాయ్‌ నాన్న`, `ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌`, `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రాలు డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల కాబోతున్నాయి. డిసెంబర్‌ 7, 8 తేదీల్లో రిలీజ్‌ కానున్నాయి. కానీ వీరి సినిమాలు సీడెడ్‌లో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. అందుకు కారణం వారి గత చిత్రాలు పెద్దగా ఆడకపోవడమే అంటున్నారు. 

36

నాని చివరగా `దసరా` సినిమాతో వచ్చారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. అయితే తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ కావడంతో ఏపీలో పెద్దగా ఆదరణ పొందలేదు. అక్కడి ఆడియెన్స్ ఎంకరేజ్‌ చేయలేదు. దీంతో నైజాంలో లాభాలు పండించినా, ఆంధ్ర, సీడెడ్‌లో మాత్రం నష్టాలనే తెచ్చిందని టాక్‌. దీనికి ముందు `వీ` సినిమా నుంచి నాని హిట్‌ లేదు. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు `హాయ్‌ నాన్న` సినిమాపై పడింది. నైజాంలో, ఆంధ్రలో బిజినెస్‌ బాగానే ఉన్నా, సీడెడ్‌ లో మాత్రం సినిమాని కొనేందుకు బయ్యర్లు మొగ్గు చూపడం లేదట. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 

Related Articles

46

నితిన్‌.. కి మూడేళ్లుగా హిట్‌ లేదు. `భీష్మా` చిత్రం తర్వాత ఆయనకు సక్సెస్‌ లేదు. వరుసగా నాలుగు సినిమాలు పరాజయం చెందాయి. బయ్యర్లు బాగా నష్టపోయారు. దీంతో ఏపీలో, సీడెడ్‌లో ఇప్పుడు నితిన్‌ నటిస్తున్న `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌` చిత్రాన్ని కొనేవారేలేరట. ముఖ్యంగా సీడెడ్‌లో ఎవరూ రావడం లేదని అంటున్నారు. ఇది నితిన్‌కి పెద్ద అవమానమనే చెప్పొచ్చు.
 

56

మరోవైపు వరుణ్‌తేజ్‌ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు కూడా ఇటీవల అంతగా ఆడటం లేదు. 2018లో వచ్చిన `తొలిప్రేమ` హిట్‌. ఆ తర్వాత నటించిన నాలుగైదు మూవీస్ వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన `గాంఢీవదారి అర్జున` సైతం డిజప్పాయింట్‌ చేసింది. వరుసగా బయ్యర్లకి నష్టాలను మిగిల్చాయి. అయితే వీరికి నైజాంలో అంతో ఇంతో వసూళ్లు వస్తున్నాయి. కానీ సీడెడ్‌లో మాత్రం పాగావేయలేకపోతున్నాడు. ఇది ఇప్పుడి వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న `ఆపరేషన్‌ వాలెంటైన్‌` కి సీడెడ్‌లో బిజినెస్‌ కాలేదని సమాచారం. 

66

పెద్ద హీరోలు దుమ్మురేపుతుంటే, ఈ యంగ్‌ హీరోలు మాత్రం తమ మార్కెట్‌ని పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకు కారణం వాళ్లు ఇంకా క్లాస్‌ మూవీస్‌ చేయడమే అంటున్నారు. మాస్‌ మూవీస్‌ చేయకపోవడంతో మాస్‌ ఆడియెన్స్ కి రీచ్‌ కాలేకపోతున్నారని, అది బిజినెస్‌పై ప్రభావం పడుతుందని అంటున్నారు. మాస్‌ మూవీస్‌ చేస్తే పుంజుకునే అవకాశం ఉంటుందని, ఇకపై వాళ్లు మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
Recommended Photos