అమ్మ లేకుండా నాన్నతో చిరంజీవి మనవరాలు దీపావళి వేడుకలు... తల్లడిల్లిపోతున్న పసిపాప!

First Published | Nov 13, 2023, 12:12 PM IST


శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడివిడిగా జీవిస్తుండగా పాప మధ్యలో నలిగిపోతుంది. ఆమె ఎక్కువగా తండ్రి ప్రేమ కోల్పోతుంది. తాజాగా నవిష్క తల్లి లేకుండానే దీపావళి చేసుకుంది. 
 

Kalyan Dev

చిరంజీవి చిన్న కుమార్తెకు పెళ్లిళ్లు కలిసి రాలేదు. చదువుకునే రోజుల్లోనే తన క్లాస్ మేట్ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనమైంది. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్న శ్రీజ కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టడం విశేషం. అప్పట్లో మీడియా శ్రీజ వివాహాన్ని హైలెట్ చేసింది. నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. 

Sreeja Kalyan dev

శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు ఒక పాప ఉంది. పేరు నవిష్క. కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజకు చెడింది. దాదాపు రెండేళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. 


Kalyan Dev-Sreeja

శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారని కథనాలు వస్తున్నా ఎవరూ స్పందించలేదు. అసలు అధికారికంగా విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది కూడా తెలియదు. తరచుగా శ్రీజ మూడో పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూతురు నవిష్క సఫర్ అవుతుంది. 

Kalyan Dev


శ్రీజ వద్దే పెరుగుతున్న నవిష్క అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ ని కలుస్తుంది. నవిష్క ఎప్పుడు వచ్చినా... ఆ ఫోటోలు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెడతాడు. తాజాగా దీపావళి పండక్కి నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వచ్చింది. పట్టుబట్టల్లో సిద్ధం చేసి కూతురితో దీపావళి జరుపుకున్నాడు కళ్యాణ్ దేవ్. 
 

Kalyan Dev

తల్లి శ్రీజ లేకుండానే నవిష్క దీపావళి చేసుకుంది. నవిష్క, కళ్యాణ్ దేవ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయడం లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోవడంతో కళ్యాణ్ దేవ్ చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
 

Latest Videos

click me!