ఇంట్రెస్టింగ్ గా కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు.. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి సెలబ్రేషన్స్

First Published | Jun 19, 2023, 6:47 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టిన రోజు వేడుకలు చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ తన జీవితంలో ఇలా మొదటి సారి బర్త్ డే జరుపుకోవడం అంటూ చెబుతూ ఆనందం వ్యక్తం చేసింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకుంది. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఊపూపిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయ్యింది. అయినా సినిమాలకు దూరంగా లేదు. సెకండ ఇన్నింగ్స్ ప్రారంభించి అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తోంది.
 

తాజాగా కాజల్ అగర్వాల్ బాలయ్య సినిమాతో పాటు ‘సత్యభామ’ చిత్రంలో నటిస్తోంది. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న Satyabhama నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ ను విడుదల చేశారు.  పవర్ ఫుల్ రోల్ లో కాజల్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతోందని టీజర్ చెబుతోంది. అయితే, ఈ చిత్ర యూనిట్ కాజల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. 
 


నేటితో కాజల్ 37వ ఏటా అడుగుపెట్టింది. దీంతో ‘సత్యభామ’ చిత్ర యూనిట్ కాజల్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కారు మాదిరి కేక్ ను తయారు చేయించి కట్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు కాజల్ చాలా సంతోషించింది. 

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. సాధారణంగా తన పుట్టిన రోజుకు వెకేషన్ కు, ఏదైనా స్పెషల్ ప్లేస్ కు వెళ్లడం, ట్రావెలింగ్ లాంటి ప్లాన్స్  ఉంటాయని తెలిపారు. కానీ ఈసారి మూవీ యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తన జీవితంలో ఇలా ఫస్ట్ టైమ్ పుట్టిన రోజు జరుపుకున్నట్టు తెలిపారు. 
 

ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక నిన్నటి ఈవెంట్ లో కాజల్ పలుచటి చీరలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. వింటేజ్ లుక్ లో ఆకట్టుకున్నారు. మొత్తానికి కాజల్ ‘సత్యభామ’తో గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. 

మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’  చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో కాజల్ రోల్ చాలా పవర్ ఫుల్ గా, మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతోందని తెలుస్తోంది.

Latest Videos

click me!