సహజ నటి జయసుధ ఓ హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హీరోయిన్ కఠినంగా వ్యవహరించకుండా ఉండిఉంటే ఎప్పుడో మరణించేవారు అంటూ కామెంట్స్ చేశారు. ఇంతకీ జయసుధ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం.
సహజ నటి జయసుధకి వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద లాంటి లెజెండ్రీ హీరోయిన్లందరితో మంచి అనుబంధం ఉంది. వాణిశ్రీ అయితే తన కెరీర్ బిగినింగ్ లో నటనలో మెళుకువలు నేర్పారని జయసుధ పేర్కొంది. జయప్రదతో ఎలాగూ జయసుధకి బాగా క్లోజ్. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలితతో ఉన్న అనుబంధాన్ని కూడా జయసుధ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జయలలిత ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు అని జయసుధ తెలిపారు.
25
లిస్ట్ లో నా పేరు లేదు
జయసుధ మాట్లాడుతూ.. 'గతంలో ఇండియన్ సినిమా 100 ఇయర్స్ సెలెబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. కొన్ని రోజుల పాటు ఆ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఆ సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు తమిళ నటీనటులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ సమక్షంలో కొందరు నటీనటులకు సత్కారాలు జరిగాయి. అందులో మా పేరు లేదు. ఆ తర్వాత రోజు జరిగిన సెలబ్రేషన్స్ కి మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో జయలలిత కొందరిని సన్మానించాలి అని అనుకున్నారట. లిస్ట్ రెడీ చేశారు.
35
స్వయంగా జయలలిత నా పేరు యాడ్ చేశారు
జయలలిత గెస్ట్ ల గురించి తెలుసుకున్నారు. గెస్ట్ ల లిస్ట్ లో నా పేరు కూడా ఉంది. కానీ సన్మానం అందుకునే వారి లిస్ట్ లో నా పేరు లేదు. జయలలిత గారు స్వయంగా నాపేరు ఆ లిస్ట్ లో యాడ్ చేయించారు. ఇప్పటికే లిస్ట్ ఎక్కువైంది అని ఎవరో చెబితే.. ఏం పర్వాలేదు జయసుధ తప్పకుండా ఉండాల్సిందే అని అన్నారట. ఆ రోజు జయలలిత గారి చేతుల మీదుగా సత్కారం అందుకునే అవకాశం దక్కింది. ఆమెని అంత దగ్గరగా చూసే అవకాశం ఎవరికీ రాదు.
ఆమె ఎవ్వరినీ తన దగ్గరికి కూడా రానివ్వరు. తనకి బాగా సన్నిహితులైన వారిని మాత్రమే దగ్గరకు రానిస్తారు. ఆమె పాదాలకు నమస్కారం చేయాలన్నా దూరంగా ఉందో నమస్కరించి వెళ్ళిపోవాలి. జయలలిత గారి అంత కఠినంగా ఉండడం సరైనదే. లేకుంటే ఆమె అన్ని రోజులు బ్రతికుండేవారు కాదు. జయలలిత గారు తన జీవితం మొత్తం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమెకి పెద్ద పెద్ద పదవులు పొందాలనే కోరిక ఏమాత్రం లేదు. కానీ ఎంజీఆర్ గారి పార్టీని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టారు.
55
వంగి నమస్కారాలు చేయడానికి కారణం అదే
ఎన్నో అవమానాలు దాటుకుని ఉక్కుమనిషిలా మారారు. ఒకసారి జయలలిత గారిని చంపడానికి కుట్ర కూడా జరిగింది. మీనం బాకం విమానాశ్రయంలో తృటిలో తప్పించుకున్నారు. అందుకే జయలలిత గారు కఠినంగా మారారు. పార్టీ వాళ్ళు, మంత్రులు ఆమెకి వంగి నమస్కారాలు చేస్తారు. అలా చేయడాన్ని జయలలిత గారు వద్దని చెప్పలేదు. దాని వెనుక ఉన్న కారణం చాలా బలమైనది. ఆమె ఒంటరి మహిళ.. అందరినీ అలా కంట్రోల్ చేయకపోతే పార్టీని ఇంతకాలం నడిపేవారు కాదు' అని జయసుధ పేర్కొన్నారు.